ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్‌గా మహేంద్రదేవ్
ABN , Publish Date - Jun 06 , 2025 | 03:50 AM
ప్రముఖ ఆర్థికవేత్త, యాక్సిస్ బ్యాంక్ మాజీ ఇండిపెండెంట్ డైరెక్టర్ డాక్టర్ సూర్యదేవర మహేంద్రదేవ్ ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి చైర్మన్‌గా నియమితులయ్యారు.
ఏపీకి చెందిన ఆర్థికవేత్తకు ప్రతిష్ఠాత్మక పదవి
నేడు బాధ్యతలు స్వీకరించే అవకాశం
దుగ్గిరాల, జూన్ 5(ఆంధ్రజ్యోతి): ప్రముఖ ఆర్థికవేత్త, యాక్సిస్ బ్యాంక్ మాజీ ఇండిపెండెంట్ డైరెక్టర్ డాక్టర్ సూర్యదేవర మహేంద్రదేవ్ ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి చైర్మన్‌గా నియమితులయ్యారు. ప్రభుత్వ పాలసీల రూపకల్పనలో ప్రధానికి సూచనలిచ్చే ఆర్థిక సలహా మండలిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహేంద్రదేవ్ ప్రతిష్ఠాత్మక పదవిని చేపట్టనున్నారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిసింది. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామానికి చెందిన డాక్టర్ మహేంద్రదేవ్ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ చేశారు. యేల్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ పూర్తిచేశారు. ప్రఖ్యాత ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవల్‌పమెంట్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్‌గానూ, వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణాయక కమిషన్ చైర్మన్‌గానూ 2008 నుంచి 2010 వరకూ పనిచేశారు.