Medical Council Appointment: ఎంబీబీఎస్ మెరిట్ విద్యార్థులకు స్వర్ణ పతకాలు
ABN , Publish Date - May 08 , 2025 | 06:02 AM
ఎంబీబీఎస్ మెరిట్ విద్యార్థులకు స్వర్ణ పతకాలు, ప్రశంసాపత్రాలు ఇచ్చే ప్రక్రియను వచ్చే విద్యాసంవత్సరం నుంచి పునరుద్ధరిస్తామని ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ కొత్త చైర్మన్ డాక్టర్ దగ్గుమాటి శ్రీహరి తెలిపారు. బుధవారం ఆయన ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు
ఏపీఎంసీ చైర్మన్‌గా డాక్టర్ దగ్గుమాటి బాధ్యతలస్వీకారం
అమరావతి, మే 7(ఆంధ్రజ్యోతి): ఎంబీబీఎస్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్వర్ణ పతకాలు, ప్రశంసాపత్రాలు ఇవ్వడాన్ని గత ప్రభుత్వం నిలిపివేసిందని, దానిని వచ్చే విద్యాసంవత్సరం నుంచి పునరుద్ధరిస్తామని ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ నూతన చైర్మన్ డాక్టర్ దగ్గుమాటి శ్రీహరి అన్నారు. బుధవారం ఉదయం ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలోని ఏపీ మెడికల్ కౌన్సిల్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు.