ఆలయ వ్యవహారాల్లో అన్యమతస్థులు వద్దు
ABN , Publish Date - Feb 15 , 2025 | 12:21 AM
మండలంలోని ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయ వ్యవహారాల్లో అన్యమతస్థులకు కాకుండా హిందువులకే అవకాశం ఇవ్వాలని హిందూ ధర్మాక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు

కదిరిఅర్బన, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయ వ్యవహారాల్లో అన్యమతస్థులకు కాకుండా హిందువులకే అవకాశం ఇవ్వాలని హిందూ ధర్మాక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆలయం వద్ద ఆందోళన చేపట్టిన వారు మాట్లాడారు. వేలాది మంది భక్తులు గ్రామదేవత గంగమ్మకు కోళ్లు, పొటేళ్లను నైవేద్యంగా సమర్పించి.. మొక్కులు తీర్చుకుంటారని, దీన్ని అన్యమతస్తులు హలాల్ పద్థతిలో నిర్వహిస్తున్నారని వాపోయారు. అలా కాకుండా హిందు సంప్రదాయ జూట్‌కా పద్ధతిలో హిందువులే అమ్మవారికి నైవేద్యం సమర్పించేలా చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు ఆలయం ఆవరణంలో దేవదాయ, ధర్మదాయ అధికారులు ఓ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ఆలయ పరిధిలో దుకాణాలకు హిందూవులకే కేటాయిచాలన్నారు. ఆలయ ఆవరణంలో విద్యుత దీపాలు, మౌలిక సదుపాయలు కల్పించాలన్నారు. అనంతరం వినతిపత్రాన్ని ఆలయ ఈఓ రవీంద్రరాజుకు అందచేశారు. కార్యక్రమంలో విశ్వహిందూపరిషత, భజరంగ్‌దళ్, ఆర్‌ఎ్‌సఎస్ సభ్యులు పాల్గొన్నారు.