Share News

ఘాట్‌ రోడ్లలో నిలబడి ప్రయాణించరాదు

ABN , Publish Date - Aug 16 , 2025 | 11:31 PM

కనుమ రహదా రుల్లో (ఘాట్‌ రోడ్లు) వెళ్లే బస్సుల్లో మహిళలు నిల్చొని ప్రయాణించడంపై నియంత్రణ పాటించను న్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి రాము వెల్లడిం చారు. తాజాగా అందిన సూచనల మేరకు ఈ నిర్ణ యం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.

ఘాట్‌ రోడ్లలో నిలబడి ప్రయాణించరాదు

ఘాట్‌ రోడ్డులో స్త్రీ శక్తి వర్తించదన్నది ప్రచారమే

జిరాక్సు గుర్తింపు కార్డులకు కూడా అనుమతి

టోల్‌ ఫీజు నుంచి మినహాయింపు : జిల్లా ప్రజా రవాణా అధికారి రాము

కలికిరి, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): కనుమ రహదా రుల్లో (ఘాట్‌ రోడ్లు) వెళ్లే బస్సుల్లో మహిళలు నిల్చొని ప్రయాణించడంపై నియంత్రణ పాటించను న్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి రాము వెల్లడిం చారు. తాజాగా అందిన సూచనల మేరకు ఈ నిర్ణ యం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. తిరుపతి రోడ్డులోని భాకరాపేట ఘాట్‌ రోడ్డులో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భాకరాపే ట, రామసముద్రం మార్గంలో వున్న ఘాట్‌ రోడ్లపై ప్రయాణించే స్త్రీ శక్తి మహిళలకు ఉచిత ప్రయాణం వర్తించదని శనివారం ఉదయం నుంచి జోరుగా జరుగుతున్న ప్రచారంపై జిల్లా ప్రజా రవాణా అధి కారి రాము స్పందించారు. అవాంఛనీయ సంఘటన లకు అవకాశం ఇవ్వకుండా ఘాట్‌ రోడ్డుపై మహిళ లు నిల్చుని ప్రయాణం చేయడాన్ని మాత్రం నిలువ రిస్తున్నట్లు చెప్పారు. రద్దీ అధికంగా వుంటే మదన పల్లె, పీలేరు, రాయచోటి డిపోల నుంచి అదనపు బస్సులను ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసేందుకు సిద్దంగా వున్నట్లు వివరించారు.


మూడు రోజుల వరుస సెలవుల కారణంగా శనివారం అన్ని సర్వీసు ల్లో ఆక్యుపెన్సీ కనీస స్థాయిలోనే వున్నట్లు చెప్పారు. ఉచిత ప్రయాణంతో మహిళా ప్రయాణీల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుందనే అంచనాల కారణం గానే కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని, అందులో నిల్చుని ప్రయాణించకుండా నివారించడం కూడా ఒకటని ఆయన విశదీకరించారు.

స్త్రీ శక్తి వర్తించదన్న ప్రచారం !

భాకరాపేట, మదనపల్లె-రామసముద్రం రోడ్డులోని ఘాట్‌ రోడ్ల మీద వెళ్లే సర్వీసుల్లో స్త్రీ శక్తి ఉచిత ప్రయాణ పథకం వర్తించదనే ప్రచారం శనివారం విస్తృతంగా కొనసాగింది. శుక్రవారం సాయంకాల ఐదు గంటల నుంచి జీరో టికెట్ల జారీ చేయనున్న ట్లు ప్రకటించారు. సాయంకాలం ఐదు తరువాత మదనపల్లెలో బస్సులు బయలుదేరితే 75 కి.మీ భాకారాపేట ఘాట్‌ ప్రయాణానికి బాగా చీకటి పడుతుంది. ఆసమయంలో క్రిక్కిరిసిన ప్రయాణీకు లతో ఘాట్‌లో నడపడం దుస్సాహసమవుతుందనే అప్రమత్తత కారణంగా ఘాట్‌ ప్రయాణానికి పథకం వర్తించదని సూటిగా చెపుతూ మదనపల్లె బస్టాండు లో స్టిక్కర్లు అతికించారు. అధికారుల అంచనాలకు మేరకు మహిళలు రాకపోవడంతో వెంటనే నాలుక్క రుచుకుని స్టిక్కర్లు తొలగించేశారు. అప్పటికే స్టిక్కర్ల ను కొందరు మాధ్యమాల్లో ప్రచారం చేశారు.


గుర్తింపు కార్డులపై అవగాహనాలేమి

ఉచిత ప్రయాణానికి సరైన గుర్తింపు కార్డులు లేని కారణంగా అక్కడక్కడా సమస్యలు తలెత్తినట్లు డీపీ టీఓ రాము, పీలేరు డీఎం నిర్మల తెలిపారు. చాలా మంది మహిళలు ఆధార్‌, ఓటరు, రేషన్‌ కార్డులు చూపిస్తున్నారని చెప్పారు. ఇవన్నీ చెల్లుబాటవు తాయని అయితే వీటిలో ఏదో ఒకటి ఒరిజినల్‌ కార్డు వుండాలని స్పష్టం చేశారు. కొందరు జిరాక్సు లు, మరి కొందరు ఫోనులో వున్న వాటిని చూపిస్తు న్నారని నిబంధనల ప్రకారం అలాంటివి చెల్లవని కూడా చెప్పారు. కేవలం స్థానికత నిరూపణ కోసమే వీటిని తప్పనిసరి చేశారని గుర్తించాలన్నారు. ఇక నుంచి మహిళలు చెల్లుబాటయ్యే ఏదో ఒక ఒరిజన ల్‌ కార్డును దగ్గరుంచుకోవాలని కూడా కోరారు.

టోల్‌ ఫీజు నుంచి మినహాయింపు

మహిళా ప్రయాణీకులకు చార్జీతోపాటు టోల్‌ ఫీజు ను కూడా మినహాయించినట్లు డీపీటీఓ రాము, డీఎం నిర్మల చెప్పారు. ఇటీవలే మదనపల్లె-తిరుపతి రోడ్డులో గండబోయనపల్లె వద్ద టోల్‌ ప్లాజా ప్రారం భించారని టిక్కెట్టు ధరకు అదనంగా ప్రయాణీకుల రూ.10 వంతున వసూలు చేస్తున్నట్లు చెప్పారు. అయితే జీరో టికెట్టుతో టోల్‌ వసూలు చేయమన్నారు.


జిరాక్సు కార్డులకు అనుమతి

స్త్రీ శక్తి పథకంలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయా ణానికి మహిళా ప్రయాణీకులు చూపించే జిరాక్సు, డిజిటల్‌ గుర్తింపు కార్డులను ఆదివారం నుంచి అను మతించనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి రాము చెప్పారు. శనివారం రాత్రి ఆయన మాట్లాడు తూ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ జిరాక్సు ప్ర తులను అనుమతిస్తామని ఉన్నతాధికార్లు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

Updated Date - Aug 16 , 2025 | 11:31 PM