విజ్ఞానం.. మురిసేలా!
ABN , Publish Date - Jan 04 , 2025 | 12:43 AM
విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు సృజనకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాయి. విద్యార్థులలో సృజనాత్మకత, తార్కిక ఆలోచన పెంచడానికి విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి విద్యావైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహి స్తోంది.

నేడు కొవ్వలి జడ్పీ హైస్కూల్‌లో జిల్లాస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన
హాజరు కానున్న మంత్రులు నాదెండ్ల , కొలుసు.. ఎంపీలు పుట్టా, పురందేశ్వరి
మూడు కేటగిరీల్లో పోటీలు.. 91 ప్రాజెక్టుల ప్రదర్శన
నిడమర్రు/దెందులూరు, జనవరి 3(ఆంధ్రజ్యోతి):
విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు సృజనకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాయి. విద్యార్థులలో సృజనాత్మకత, తార్కిక ఆలోచన పెంచడానికి విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి విద్యావైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహి స్తోంది. ఇప్పటికే డిసెంబరులో పాఠశాల, మండల స్థాయిల్లో సైన్స్ ఫెయిర్స్ నిర్వహించిన విద్యాశాఖాధి కారులు శనివారం దెందులూరు మండలం కొవ్వలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం 9 గం టల నుంచి సాయంత్ర 5 గంటల వరకు జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశా రు. ఈ కార్యక్రమానికి ఏపీ పౌరసంబంధాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్, రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి, దెందు లూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, కలెక్టర్ వెట్రిసెల్వి, జడ్పీ చైర్మన్ ఘంటా పద్మశ్రీ, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొనున్నారు. గణితం, భౌతిక –రసాయన శాస్త్రం, భూమి, పర్యావరణం, అంతరిక్ష శాస్త్రం, ఇంజనీరింగ్, జీవ శాస్త్రం, కంప్యూటర్ సైన్స్ మొత్తం ఎనిమిది అంశాలపై ప్రాజెక్టులు ప్రదర్శించ నున్నారు.
మొత్తం 91 ప్రాజెక్టులు
జిల్లాలోని 27 మండలాల నుంచి మండలానికి మూడు చొప్పున మొత్తం 81 ప్రాజెక్టులు, అటల్ టింకరింగ్ ల్యాబ్ ఉన్న పాఠశాలల నుంచి 10 అంశాలు మొత్తం 91 ప్రాజెక్టులు ప్రదర్శించనున్నారు. ఈ పోటీల్లో ఒక్కో కేటగిరి నుంచి రెండు టీమ్‌లను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. మొత్తం రాష్ట్ర స్థాయికి ఆరు టీమ్‌లు ఎంపిక అవుతాయి. ఈ ప్రద ర్శనలో అత్యంత ప్రతిభ కనబరిచిన వారికి సాయం త్రం బహుమతి ప్రదానం జరుగుతుందని డీఈవో ఎం.వెంకట లక్ష్మమ్మ, కొవ్వలి హైస్కూల్ హెచ్‌ఎం శర్మ తెలిపారు.
తొలిసారిగా ఉపాధ్యాయులు..
జిల్లా స్థాయిలో నిర్వహించే ఈ సైన్స్ ఫెయిర్‌లో జిల్లాలోని 27 మండలాల నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొనున్నారు. మూడు కేటగిరీల్లో పోటీలు నిర్వహించనున్నారు. విద్యార్థుల వ్యక్తిగత కృత్యాలు, గ్రూపు కృత్యాలు, ఉపాధ్యాయుల కేటగిరిల్లో పోటీలు జరుగుతాయి. తొలిసారి ఈ పోటీల్లో ఉపాధ్యాయులు పాల్గొనే అవకాశం కల్పించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్య పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యా ర్థులు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నారు. ఇప్పటికే మండల స్థాయిలో విజేతలుగా నిలిచిన వారు నేడు జరిగే జిల్లాస్థాయి పోటీల్లో తమ ప్రతిభ చూపేందుకు సన్నద్దమయ్యారు.
విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపు
విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణ, తార్కిక ఆలోచన, సృజనాత్మకతను పెంచ డానికి సైన్స్ ఫెయిర్‌లు వేది కగా నిలుస్తాయి. సమాజ శ్రేయస్సు, భూమి, పర్యా వరణ పరిరక్షణ, మాన వాళికి ఉపయోగకరమైన ప్రాజెక్టులకు ప్రాఽధాన్యత ఇవ్వనున్నాం. థర్మకోల్ ప్రాజెక్టులు అనుమతి లేదు.
– వెంకటలక్ష్మమ్మ, డీఈవో, ఏలూరు