Share News

రంజాన్‌ ఏర్పాట్ల కోసం అధికారులకు ఆదేశాలివ్వండి

ABN , Publish Date - Feb 14 , 2025 | 06:49 AM

పవిత్ర రంజాన్‌ నెలలో ముస్లింలకు సౌకర్యాలు కల్పించేందుకు, ఏర్పాట్ల నిర్వహణకు జిల్లా పరిపాలన, అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ

రంజాన్‌ ఏర్పాట్ల కోసం అధికారులకు ఆదేశాలివ్వండి

ప్రభుత్వానికి రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ అబ్దుల్‌ అజీజ్‌ లేఖ

అమరావతి, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): పవిత్ర రంజాన్‌ నెలలో ముస్లింలకు సౌకర్యాలు కల్పించేందుకు, ఏర్పాట్ల నిర్వహణకు జిల్లా పరిపాలన, అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి వక్ఫ్‌ బోర్డు లేఖ రాసింది. ఈ మేరకు రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ అబ్దుల్‌ అజీజ్‌ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే వక్ఫ్‌ బోర్డు కార్యాలయం నుంచి రాష్ట్రంలోని ఇన్‌స్పెక్టర్‌ ఆడిటర్‌ వక్ఫ్‌లకు, వక్ఫ్‌ సంస్థల నిర్వాహకులకు రంజాన్‌ మాసానికి సంబంధించిన ఏర్పాట్లు చేపట్టవలసిందిగా ఆదేశించామని తెలిపారు. ఆరోగ్య జాగ్రత్తలు, పారిశుధ్యం, భద్రతా ప్రమాణాలు, విదుత్‌సరఫరాపై సంబంధితశాఖల అధికారులను ఆదేశించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. ఉపవాస దీక్షలు ఉండే ముస్లింల కోసం దుకాణాలకు, కూరగాయల మార్కెట్లకు, హోటళ్లు రాత్రి బాగా పొద్దుపోయే వరకు తెరిచి ఉంచేలా, తెల్లవారుజామున తెరిచేందుకు అనుమతులు ఇచ్చే విధంగా పోలీ్‌సశాఖను కోరినట్టు అజీజ్‌ తెలిపారు.

Updated Date - Feb 14 , 2025 | 06:49 AM