జిల్లాస్థాయి పోటీల్లో ధర్మవరం విజేత
ABN , Publish Date - Feb 24 , 2025 | 11:43 PM
అనంతపురంలోని ఇండోర్ స్టేడియంలో ఈనెల 22, 23తేదీల్లో నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి ఆర్డీటీ బాస్కెట్‌బాల్ పోటీల్లో ధర్మవరం బాల, బాలికల జట్లు విజేతలుగా నిలిచినట్టు ఉమ్మడి జిల్లా బాస్కెట్‌బాల్ అసోషియేషన సెక్రటరీ శెట్టిపి జయచంద్రారెడ్డి తెలిపారు.

ధర్మవరం, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): అనంతపురంలోని ఇండోర్ స్టేడియంలో ఈనెల 22, 23తేదీల్లో నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి ఆర్డీటీ బాస్కెట్‌బాల్ పోటీల్లో ధర్మవరం బాల, బాలికల జట్లు విజేతలుగా నిలిచినట్టు ఉమ్మడి జిల్లా బాస్కెట్‌బాల్ అసోషియేషన సెక్రటరీ శెట్టిపి జయచంద్రారెడ్డి తెలిపారు. అండర్-15 విభాగంలో జరిగిన బాలికల ఫైనల్స్ పోటీల్లో బుక్కరాయసముద్రం జట్టుతో తలపడి విజేతగా నిలిచింది. అలాగే బుక్కరాయసముద్రం బాలుర జట్టుతో కూడా తలపడి విజేతగా నిలిచింది. దీంతో విజేతలను సోమవారం ధర్మవరంలో జిల్లాసెక్రటరీ, ధర్మాంబ బాస్కెట్ బాల్ అసోషియేషన అధ్యక్షుడు మేడా పురం రామిరెడ్డి, కార్యదర్శి వాయల్పాడు హిదయ్‌తుల్లా, కోచ సంజయ్, వ్యాయా మ ఉపాధ్యాయులు నాగేంద్ర, రమేశబాబు అభినందించారు.