Share News

కొలనుభారతికి పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - Feb 03 , 2025 | 11:43 PM

కొలనుభారతి క్షేత్రానికి రెండో రోజు సోమవారం కూడా భక్తులు పోటెత్తారు. ఈ ఏడాది పంచమి 2, 3 తేదీల్లో రావడంతో ఆది, సోమవారాల్లో అమ్మవారి జన్మనక్షత్రం పురస్కరించుకుని వేడుకలు వైభవంగా జరిగాయి.

 కొలనుభారతికి పోటెత్తిన భక్తులు
చిన్నారికి అక్షరాభ్యాసం చేయిస్తున్న పురోహితుడు

కొత్తపల్లి, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): కొలనుభారతి క్షేత్రానికి రెండో రోజు సోమవారం కూడా భక్తులు పోటెత్తారు. ఈ ఏడాది పంచమి 2, 3 తేదీల్లో రావడంతో ఆది, సోమవారాల్లో అమ్మవారి జన్మనక్షత్రం పురస్కరించుకుని వేడుకలు వైభవంగా జరిగాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కొత్తపల్లి ఎస్‌ఐ కేశవ తమ సిబ్బందితో కలిసి శివపురం గూడెం వద్దే భక్తుల వాహనాలు నిలిపివేసి అక్కడి నుంచి విడతల వారిగా వాహానాలు క్షేత్రానికి పంపించారు. ఆది, సోమవారాల్లో రెండు రోజులు సుమారు 20వేల మంది పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని అధికారులు అంచనా వేశారు. కొలనుభారతి వసంతపంచమి వేడుకలకు హాజరైన భక్తుల ద్వారా రూ.2,58,330 ఆదాయం లభించినట్లు ఈవో రామలింగారెడ్డి తెలిపారు. భక్తులకు కాశిరెడ్డి నాయన ఆశ్రమ కమిటి ఆర్యవైశ్య సత్ర నిర్వహకులు శివపురం గ్రామ సమీపంలోని కాలభైరవ అన్నదాన ఆశ్రమ ట్రస్టు నిర్వాహకులు విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగియడంతో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - Feb 03 , 2025 | 11:43 PM