Share News

Raghavendra Swami Darshan: మంత్రాలయం భక్తజన సంద్రం

ABN , Publish Date - Jul 11 , 2025 | 04:02 AM

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయానికి గురువారం భక్తులు పోటెత్తారు.

Raghavendra Swami Darshan: మంత్రాలయం భక్తజన సంద్రం

  • రాఘవేంద్రస్వామి మఠానికి పోటెత్తిన భక్తులు

మంత్రాలయం, జూలై 10(ఆంధ్రజ్యోతి): ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయానికి గురువారం భక్తులు పోటెత్తారు. రాఘవేంద్ర స్వామి దర్శనార్థం లక్ష మందికి పైగా వచ్చిన భక్తులతో మఠం ప్రాంతంతో పాటు మంత్రాలయం పట్టణం రద్దీగా కనిపించింది. గురుపౌర్ణమితో పాటు రాఘవేంద్రస్వామికి ఇష్టమైన గురువారం కావటంతో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహరాష్ట్ర, తమిళనాడు నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అన్నపూర్ణ భోజనశాల, మహాముఖద్వారం, మధ్వమార్గ్‌ కారిడార్‌, ప్రధాన రహాదారులు, రాఘవేంద్ర సర్కిల్‌, తుంగభద్ర నది తీరం భక్తులతో కోలాహాలంగా మారింది. తుంగభద్ర నదిలో పుణ్య స్నానాలు ఆచరించి గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. మఠం అధికారులు రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Updated Date - Jul 11 , 2025 | 04:02 AM