ఆర్థిక క్రమశిక్షణతోనే అభ్యున్నతి
ABN , Publish Date - Feb 26 , 2025 | 12:26 AM
ప్రతి ఒ క్కరూ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తేనే అభ్యున్నతి సాధ్యమని కలెక్టర్ టీఎస్ చేతన పేర్కొన్నారు.

పుట్టపర్తిటౌన, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఒ క్కరూ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తేనే అభ్యున్నతి సాధ్యమని కలెక్టర్ టీఎస్ చేతన పేర్కొన్నారు. ఈనెల 24 నుంచి 28 వరకు నిర్వహించే ఆర్థిక అక్షరాశ్యత వారోత్సవాలకు చెందిన పోస్టర్‌ను స్థానిక కలెక్టరేట్‌లోని సమావేశమందిరంలో మంగళవారం ఆవిష్కరించిన ఆయన మాట్లాడారు. మహిళలు పనిచేసే ప్రాం తాల్లో ఆర్థిక అక్షరాశ్యతపై వివిధ పోటీలు నిర్వహించి నగదు బహుమతులు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా లీడ్‌బ్యాంకు మేనేజర్ రమణకుమార్, పరిశ్రమలశాఖ జనరల్ మేనేజర్ నాగరాజు, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి హరికృష్ణ, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, పరిశ్రమలశాఖ జోనల్ మేనేజర్ సోనీసహానీ పాల్గొన్నారు.