Share News

Deputy CM Pawan Kalyan: నా తొలి ప్రాధాన్యం రాజకీయాలకే

ABN , Publish Date - Jul 23 , 2025 | 03:05 AM

భవిష్యత్‌ రాజకీయమా.. సినిమా అంటే నా మొదటి ప్రాధా న్యం రాజకీయాలకే ఇస్తానని, ప్రజా సేవలకే అంకి తం చేస్తానని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సృష్టం చేశారు.

Deputy CM Pawan Kalyan: నా తొలి ప్రాధాన్యం రాజకీయాలకే

  • ‘హరిహర వీరమల్లు’ ప్రచారం నా బాధ్యత: పవన్‌ కల్యాణ్‌

  • ప్రత్యేక పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది.. నా నిర్మాతలు తీవ్రంగా నష్టపోయారు

  • ఇది తీయడానికి ఐదేళ్లు పట్టింది.. రెండేళ్లు కరోనాతో ఇబ్బందులు

  • ఆ తర్వాత జగన్‌తో మ్యాన్‌మేడ్‌ డిజాస్టర్‌.. ఆనక చేద్దామనుకుంటే

  • చంద్రబాబును అరెస్టు చేశారు.. వైజాగ్‌లో నన్నూ ఇబ్బంది పెట్టారు

  • ప్రభుత్వంలోకి వచ్చాక ఆరు నెలలు పాలనపై పూర్తిగా దృష్టి పెట్టాను

  • ఆ తర్వాత మిడ్‌వ్యాలీలో సెట్టింగ్‌ వేసి షూటింగ్‌ చేశాం: పవన్‌

ఏపీకి సినిమా పరిశ్రమ వస్తుందా...?

చిత్ర పరిశ్రమ ఏపీకి కొత్తగా రావలసిన అవసరం లేదు. కొత్త మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలి. ఇక్కడ ఫిల్మ్‌ డెవల్‌పమెంట్‌ స్కూల్‌ రావాలి. దీని వల్ల చిత్ర నిర్మాణాలు పెరుగుతాయి. అన్నీ ఉంటే సినిమా ఇండస్ట్రీ ఏపీకి వస్తుంది. తగిన వసతులు, సౌకర్యాలు పెరగాల్సిన అవసరం ఉంది.

అమరావతి, జూలై 22(ఆంధ్రజ్యోతి): భవిష్యత్‌ రాజకీయమా.. సినిమా అంటే నా మొదటి ప్రాధా న్యం రాజకీయాలకే ఇస్తానని, ప్రజా సేవలకే అంకి తం చేస్తానని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సృష్టం చేశారు. హరిహర వీరమల్లు సిని మా విడుదల సందర్భంగా మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నేను జనసేనపై పూర్తిస్థాయిలో ఫోకస్‌ నడుపుతున్న సమయంలో ప్రారంభించిన సినిమాలు ఇవి. ప్రభుత్వంలో భాగస్వామ్యం అయిన తర్వాత ప్రత్యేక పరిస్థితుల్లో సినిమా చేయాల్సి వచ్చిందన్నారు.


సనాతన ధర్మానికి, ఈ సినిమాకు సంబంధం ఉందా..?

ఈ సినిమా ఏపీకి చాలా కీలకం. కోహినూర్‌ వజ్రం విజయవాడ కృష్ణా తీరం కొల్లూరు వజ్రాలగనుల వద్ద దొరికింది. ఇదే సమయంలో మన మచిలీపట్నం అంతర్జాతీయంగా ఎగుమతులు, దిగుమతులకు కేంద్రంగా ఉండేది. అలాంటి చోట జరిగిన కథే ఇది. కోహినూర్‌ కులీకుతుబ్‌షా నుంచి మొగల్‌ చక్రవర్తుల వద్దకు చేరింది. ఔరంగజేబు ఆశీనుడై ఉండేనెమలి సింహాసనంపై వజ్రం ఉంటుంది. అలాంటి వజ్రాన్ని తీసుకురావాలని హీరోకు బాధ్యత అప్పగిస్తారు. అది నాకు చాలా ఇంట్రె్‌స్టగా అనిపించింది. ఈ సినిమా చేయడానికి ఐదేళ్లు పట్టింది. 2 కరోనా లు ఇబ్బందులు పెట్టాయి. మ్యాన్‌ మేడ్‌ డిజాస్టర్‌ (వైసీపీ) మరింత ఇబ్బంది పెట్టింది. సినిమా చేద్దామనుకునేలోగా గత ప్రభుత్వం చంద్రబాబును అరె స్టు చేయడం.. నన్ను వైజాగ్‌లో ఇబ్బందులు పెట్ట డం వంటివి ఎదురయ్యాయి. చివరగా ప్రభుత్వం మారిన వెంటనే చేయాలని నిర్ణయించాను. కానీ, ప్రభుత్వం వచ్చిన కొత్తలో 6 నెలల పాటు అడ్మినిస్ట్రేషన్‌పై అవగాహన పెంచుకుని.. ఆ తర్వాత మిడ్‌వ్యాలీలో సెట్స్‌ వేశాం. రోజూ ఉదయం 7 గంటల నుంచి 2 గంటలు షూటింగ్‌ చేశాం. రాత్రిళ్లూ కూడా చేశాం. ఈ సినిమాలో ధర్మం అనేదీ ఒక ఎలిమెంట్‌. నేను రాజకీయాల్లోకి వచ్చాను. సినిమానా, రాజకీయమా అంటే తొలి ప్రాధాన్యం రాజకీయాలకే.


నిర్మాతలు నష్టపోయారని..

నేను, నిర్మాతలు నష్టపోయాం. భగవంతుడు ఇచ్చే ది రూపాయైునా దానితోనే సరిపెట్టుకోవాలని ని ర్ణయించుకున్నాం. గత ప్రభుత్వంలో వాళ్లు ప్ర త్యర్థుల ఆర్థిక మూలాల మీద దెబ్బకొట్టడం స హజం. మేం కూడా యుద్ధంలో దిగాం కాబట్టి దీ నిని అంత సీరియ్‌సగా తీసుకోవాల్సిన అవసరం లేదని వదిలే శాం. సినిమా విడుదల సందర్భంగా కొంత బాధ్యతతో వ్యవహరించాలి.

ఎమ్మెల్యేలకు చూపిస్తారా..?

ఆ ప్రతిపాదన ఇప్పటి వరకూ లేదు. కూటమి ఎమ్మెల్యేలు ప్రత్యేక షో అడిగితే వేస్తాను.

సీఎంగారిని పిలుస్తారా..?

ఆయన బిజీ. ఆయన సినిమాలు ఐదు నిమిషాలు చూస్తారేమో! రోజూ నన్నే చూస్తారు కదా..!

క్లైమాక్స్‌ డైరెక్ట్‌ చేశారా..?

ఒక సినిమా తీసేటప్పుడు రోజూ చాలా నలుగుతాం. ప్రతి ఒక్కరం పోరాటం చేస్తాం. సినిమా గ్లామర్‌గా కనిపిస్తుంది. నాకు చిరంజీవిగారి లాంటి అన్నయ్య ఉండి కూడా చాలా విజయాల తర్వాత జానీ సినిమా డైరెక్ట్‌ చేశాను. అది ఫస్ట్‌ షోలోనే పోయింది. బాగోలేదని అనగానే డిస్ర్టిబ్యూటర్లు మా ఇంటి మీదకు వచ్చేశారు. డబ్బులు వచ్చినప్పుడు నాకు ఎక్కువ ఇవ్వలేదు.. ఇప్పుడెందుకు ఇలా వచ్చారని అనిపించింది. ఆ రోజు నా రెమ్యునరేషన్‌ వెనక్కి ఇచ్చేశాను. దాని కోసం రూ.15 లక్షల అప్పు తీసుకున్నాను. జానీ ఫెయిల్యూర్‌ రాజకీయాల్లో ఉపయోగపడింది. 2019లో ఓడిపోతే ఆ సినిమాయే గుర్తుకొచ్చింది. జీవితంలో ఫెయిల్‌ ఒక పార్ట్‌. ఏఎం రత్నం(నిర్మాత)లాంటి వ్యక్తి ఈ రోజు సినిమా రిలీజ్‌లకు ఇబ్బంది పడుతుంటే చాలా బాధేసింది. అందుకే నేనే దగ్గరుండి ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లాలని నిర్ణయించాను. పాలిటిక్స్‌లో ఉన్నాను కాబట్టి సినిమాలు బాగా చేయడేమోనన్న సందేహం ఎక్కువ మందిలో ఉంటుంది. అందుకే ప్రత్యేక శ్రద్ధ పెట్టి చేశాను. యాక్షన్‌ కొరియోగ్రఫీ చేసి చాలా ఏళ్లయింది. క్లైమాక్స్‌ పార్ట్‌ నా మనస్సుకు చాలా దగ్గరగా ఉంటుంది. మా సినిమా మొత్తం ఎంటర్‌టైనర్‌. పార్ట్‌-2లో 20 శాతం షూటింగ్‌ పూర్తి చేశాం. ఇకపై సినిమాలు చేయాలా వద్దా అన్నది.. వచ్చే డబ్బులు, దొరికే సమయాన్ని బట్టి భగవంతుడు నిర్ణయిస్తాడు.


పెద్ద మనసుతో వదిలేద్దాం..

థియేటర్ల విషయంలో కొన్ని అనుకోని పరిస్థితులు వస్తాయి. పెద్ద మనస్సుతో వదిలేయడమే.

తొలిసారి సినిమా ప్రమోషన్లలో..

నా వల్ల నిర్మాతలు నష్టపోయారు. నేను ప్రత్యేక పరిస్థితుల్లో ఈ సినిమా ప్రమోషన్‌ చేయాల్సి వస్తోంది. కరోనా, పొలిటికల్‌ డిజాస్టర్‌, అడ్మినిస్ట్రేషన్‌.. మూడింటికీ నిర్మాతలు బలయ్యారు. వారికి అండగా నిలవాల్సిన నైతిక బాధ్యత నాపై ఉంది. కాబట్టి ప్రచారం చేయాల్సి వస్తోంది. నేను రెమ్యునరేషన్‌ కూడా తీసుకోలేదు. రేపు హిట్‌ అవుతుందో లేదో తెలియదు. కానీ సినిమా రిలీజ్‌ చేయాలి.. ఆడాలి.. విజయం సాధించాలనే ఆశతో ఉన్నాం.

సర్వాయి పాపన్న క్యారెక్టర్‌కు సంబంధం లేదు..

సర్వాయి పాపన్న గౌడ్‌ క్యారెక్టర్‌కు, ఈ సినిమా హీరోకు సంబంధం లేదు. ఒక వేళ కోహినూర్‌ వజ్రమే తీసుకొస్తే ఎలా తెస్తారన్నదానిపైనే కథ ఉంటుంది. ఇది చారిత్రక ఆధారాలున్న పాత్ర కాదు. సృష్టించిన క్యారెక్టర్‌ మాత్రమే.

సినిమా తీసినప్పుడు ఇబ్బందులు పడ్డారా?

వైజాగ్‌లో ఇబ్బంది పెట్టిన తర్వాత పార్టీని సీరియ్‌సగా నడిపించాలని నిర్ణయించుకున్నాను. రాజకీయాలతో పాటు సినిమాలు చేస్తూనే ఇబ్బందులు అధిగమించి ఇక్కడి వరకూ వచ్చాను. ఇదే పెద్ద విజయంగా అనిపిస్తోంది. జీవితంలో ఆర్గానిక్‌గా కొన్ని ఇబ్బందులు వస్తాయి. నేను ప్రతి చిన్న పనికీ యుద్ధమే చేయాల్సి వస్తుంది. నా జీవితంలో సంఘర్షణ భాగమైంది. అయినా సరే ఎంత బలంగా నిలబడగలమన్న దానిపైనే నా ఆలోచన ఉంటుంది.

టికెట్ల ధరలపై..

భీమ్లానాయక్‌ సినిమా విడుదల సమయంలో టికెట్లు రేట్లు తగ్గించినా.. ఇప్పుడు రేట్లు పెంచినా నిరుత్సాహం లేదు. భగవంతుడు ఏది ఇస్తే అది తీసుకోవడమే. నా సినిమాకు ప్రత్యేకించి ఇస్తే ఆనందించేవాడిని కాదు. టికెట్ల ధరలు అందరికీ పెంచారు. ఇలాంటి సమయంలో నాకు ఇవ్వకపోతే వివక్ష చేసినట్లు ఉంటుంది. అది కూడా తప్పవుతుంది. అందుకని దీనిని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు.


ఈ వార్తలు కూడా చదవండి..

భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయాలు

వేల కోట్ల భూములు.. ఖరీదైన విల్లాలు.. వెలుగులోకి మాజీ మంత్రి అనిల్ అక్రమాలు

For More AP News and Telugu News

Updated Date - Jul 23 , 2025 | 03:12 AM