దాగుడుమూతలు
ABN , Publish Date - Feb 13 , 2025 | 01:07 AM
వైసీపీ ప్రభుత్వం నాటి నుంచి ఏళ్ల తరబడి అనధికారిక డిప్యూటేషన్లు, ప్రైవేటు ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లలో మొక్కుబడి తనిఖీలు, కొందరు సిబ్బంది లంచావతారాలుగా మారా రన్న ఆరోపణలు, పలువురు పీహెచ్‌సీల మెడి కల్ ఆఫీసర్లపై కక్ష సాధింపులు, కార్యాలయం లో పర్యవేక్షణాలోపం.. తదితర అంశాలపై ఇటీ వల తరచూ వార్తల్లో నిలుస్తున్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో బుధవారం హఠాత్తుగా నాట కీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

ఐదుగురికే డిప్యూటేషన్ల రద్దు.. మిగతావారంతా డీఎంహెచ్‌వో కార్యాలయంలోనే..
వైసీపీ ప్రభుత్వంనుంచి సీట్లకు అతుక్కుపోయిన ‘వారి సేవలు’ ఇప్పటికీ అవసరమట!
ఏళ్ల తరబడి పీహెచ్‌సీలను వదిలేసి డీఎంహెచ్‌వోల వద్ద పాగా..
ఏలూరు అర్బన్, ఫిబ్రవరి 12 (ఆంద్రజ్యోతి) : వైసీపీ ప్రభుత్వం నాటి నుంచి ఏళ్ల తరబడి అనధికారిక డిప్యూటేషన్లు, ప్రైవేటు ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లలో మొక్కుబడి తనిఖీలు, కొందరు సిబ్బంది లంచావతారాలుగా మారా రన్న ఆరోపణలు, పలువురు పీహెచ్‌సీల మెడి కల్ ఆఫీసర్లపై కక్ష సాధింపులు, కార్యాలయం లో పర్యవేక్షణాలోపం.. తదితర అంశాలపై ఇటీ వల తరచూ వార్తల్లో నిలుస్తున్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో బుధవారం హఠాత్తుగా నాట కీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. వివిధ విభాగాల్లో ప్రక్షాళనదిశగా మార్పులు, చేర్పులు జరిగాయి. ఆ మేరకు డీఎంహెచ్‌వో డాక్టర్ మాలిని బుధవారం పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో తీసుకున్న ఈ కొద్దిపాటి ప్రక్షాళన ప్రభావం కొందరిపైనే పడిందని, అసలు ఆయా విభాగా ల్లో దీర్ఘకాలంగా సీట్లను అతుక్కుపోయినవారిని ఉదాసీనంగా వదిలేశారనే విమర్శలు ప్రారంభ మయ్యాయి. ఆ ప్రకారం పీహెచ్‌సీల్లో బాధ్యత లు నిర్వర్తించాల్సిన మెడికల్ ఆఫీసర్లలో డిప్యూటేషన్లపై డీఎంహెచ్‌వో కార్యాలయంలో నియమిస్తూ పూర్వపు డీఎంహెచ్‌వో డాక్టర్ శర్మిష్ఠ గతేడాది జారీచేసిన ఉత్తర్వులను ప్రస్తుత డీఎంహెచ్‌వో డాక్టర్ మాలిని రద్దు చేస్తూ ఆయా బాధ్యతలను ఇన్‌చార్జి హోదాల్లో కొందరికి అప్పగించారు. దీనికనుగుణంగా ఇక మీదట డీఎంహెచ్‌వో కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు, ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం(ఎఫ్‌డీపీ) నోడల్ ఆఫీసర్ బాధ్యతలను డాక్టర్ ఆర్. రోహి త్‌కు, జాతీయ ఆరోగ్య పథకం డీపీఎంవో, ఉద్యో గుల ముఖగుర్తింపు ఆధారిత హాజరు (ఎఫ్ డీపీ)నోడల్ ఆఫీసర్ బాధ్యతలను డాక్టర్ కె.భా ర్గవికి అప్పగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీరిద్దరూ ఇప్పటికే గత వైసీపీ ప్రభుత్వం నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కోసం జిల్లాలో ఎవరైనా డాక్టరు సెలవు పెడితే సంబంధిత రోజుల్లో ప్రత్యామ్నాయంగా ఆయా పీహెచ్‌సీ/గ్రామాల్లో వైద్యసేవలందిం చేందుకు డీఎంహెచ్‌వో కార్యాలయంలో బఫర్ డాక్టర్ల బృందంలో నియమితులై ఉన్నారు.
ఇప్పటి వరకు కార్యాలయ ఏవో బాధ్యతలతో పాటు, మరో నాలుగు విభాగాల విధులను ఇన్ చార్జి హోదాలో ఎనిమిది నెలలుగా నిర్వర్తి స్తున్న డాక్టర్ చక్రధర్‌ను పెదపాడు పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్‌గా కొనసాగాలని డీఎంహెచ్‌వో ఆదేశాల్లో పేర్కొన్నారు. డీఎంహెచ్‌వో కార్యాల యంలోనే డిప్యుటేషన్లపై విధులు నిర్వర్తిస్తున్న మరో నలుగురు ఎంపీహెచ్‌ఎస్, ఎంపీ హెచ్ ఈవోలు, డీఈవోలను వారి పూర్వపు పని స్థానాల్లో తక్షణమే రిపోర్టు చేయాలని ఆదేశిం చారు. వీరితోపాటు ఇదే కార్యాలయంలో డిప్యు టేషన్లపై ఆయా విభాగాల్లో మరో 12 మంది కొనసాగుతున్నట్టు గుర్తించినా వీరిలో ఏడుగురి ని ‘పని సర్దుబాటు’ కింద డిప్యుటేషన్లపై కొన సాగిస్తూనే వారానికి మూడు రోజులు సంబం ధిత పీహెచ్‌సీలకు వెళ్లి విధులు నిర్వర్తించాలని వెసులుబాటు కల్పిం చారు. మరో ఐదుగురిపై ఏ నిర్ణయం తీసుకోకుండానే కార్యాలయంలోనే కొనసాగేం దుకు వీలు కల్పించారు.
జిల్లా పునర్విభజన కారణంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన రిక్రూట్ మెంట్లు, సర్వీస్ మేటర్లు ఏలూరు డీఎంహెచ్‌వో కార్యాలయ పరిధిలోనే చూడాల్సి ఉంటుందన్న సాకుతో పలువురు ఉద్యోగుల డిప్యుటేషన్లను రద్దుచేయ కుండా కొనసాగింపునకు చర్యలు తీసుకోవడం విమర్శల పాలవుతోంది. వాస్తవానికి జీవో 143, జీవో 32, జిల్లా పునర్విభజనల వల్ల ఏర్పడే కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ప్రస్తుతం డీఎంహెచ్‌వో కార్యాలయ పీవోడీటీటీ, మేల్ ట్రైనింగ్ స్కూళ్లలో జూనియర్, సీనియర్ అసి స్టెంట్లు, జీవో 143లో రెండు ఎంపీహెచ్‌ఈవో, ట్రైనింగ్ స్కూలులో ఒక మెడికల్ ఆఫీసర్ సేవ లను వినియోగించుకునే వెసులుబాటు ఉన్నా, ఇంతవరకు శాంక్షన్డ్ పోస్టులు లేని విభాగాల్లో పీహెచ్‌సీల నుంచి ఉద్యోగ సిబ్బందిని డిప్యుటే షన్లపై కొనసాగించడంపై సందేహాలు వ్యక్తమ వుతున్నాయి. మరోవైపు కొందరికి జారీ చేసిన డిప్యుటేషన్ల వెసులుబాటు ఆర్డర్లలో వారానికి మూడు రోజులపాటు పీహెచ్‌సీలకు వెళ్లి విధు లు నిర్వర్తించాలని ఆదేశించినా దీనిపై స్పష్టత ఉత్తర్వుల్లో ఇవ్వకపోవడం మొక్కుబడి ఆదే శాల్లో భాగమేనని ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి. ఐదుగురు తప్ప, వైసీపీ ప్రభుత్వం నుంచి పీహెచ్‌సీలను వదిలిపెట్టి డీఎంహెచ్‌వో కార్యాలయంలో తిష్టవేసిన మిగతా 20 మంది కొనసాగేందుకు వీలుగా ప్రక్షాళనను ‘మమ’ అనిపించారని సమాచారం.