Fee Regulation: 86 కాలేజీలకు డిగ్రీ ఫీజులు ఖరారు
ABN , Publish Date - Aug 05 , 2025 | 06:17 AM
రాష్ట్రవ్యాప్తంగా 86 కాలేజీల్లో డిగ్రీ కోర్సులకు ఫీజులు ఖరారు చేస్తూ ఉన్నత విద్యాశాఖ సోమవారం ఉత్తర్వు లు జారీచేసింది.
అమరావతి, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా 86 కాలేజీల్లో డిగ్రీ కోర్సులకు ఫీజులు ఖరారు చేస్తూ ఉన్నత విద్యాశాఖ సోమవారం ఉత్తర్వు లు జారీచేసింది. 2023-26 వరకు ఈ ఫీజులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. వాస్తవానికి అన్ని కాలేజీలకూ 2003లోనే ఫీజులు ఖరారయ్యాయి. ప్రాసెసింగ్ ఫీజులు చెల్లించకపోవడంతో ఈ కాలేజీలకు ఫీజులు ఖరారు చేయలేదు. దీనిపై కాలేజీ యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. న్యా యస్థానం ఆదేశాల మేరకు ఫీజులు నిర్ణయిస్తూ ఉన్నత విద్యాశాఖ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపుగా అన్ని కాలేజీలకూ బీఎస్సీకి రూ.15వేలు, బీకామ్‌కు రూ.12వేలు, బీఏకి రూ.11వేలు, బీసీఏకి రూ.18వేల చొప్పున ఫీజులు నిర్ణయించింది.