Share News

Degree Admissions: ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో డిగ్రీ దరఖాస్తులు

ABN , Publish Date - Jul 17 , 2025 | 05:00 AM

డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల విధానంలో ఉన్నత విద్యా శాఖ మార్పులు చేసింది..

Degree Admissions: ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో డిగ్రీ దరఖాస్తులు

అమరావతి, జూలై 16(ఆంధ్రజ్యోతి): డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల విధానంలో ఉన్నత విద్యా శాఖ మార్పులు చేసింది. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తులు సమర్పించే విధానం అమల్లో ఉండగా.. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. డిగ్రీ అడ్మిషన్ల నిబంధనలు-2000కు ఈ మేరకు సవరణలు చేస్తూ ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం...

  • ఓఏఎండీసీ వెబ్‌సైట్‌ ద్వారా వేర్వేరు కాలేజీలకు, వేర్వేరు కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

  • విద్యార్థి నేరుగా కాలేజీకి వెళ్లి కూడా దరఖాస్తు సమర్పించవచ్చు. ఆ కాలేజీ ప్రిన్సిపాల్‌ ఆ దరఖాస్తును ఓఏఎండీసీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసి, విద్యార్థికి ధ్రువీకరణ పత్రం ఇస్తారు.

  • ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సమయంలో ఆధార్‌ ధ్రువీకరణ తప్పనిసరి.ఒకవేళ ఒక విద్యార్థి ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో రెండు రూపాల్లో దరఖాస్తు చేసుకుంటే ఆఫ్‌లైన్‌లో కాలేజీలో సమర్పించిన దరఖాస్తును మొదటి ప్రాధాన్యతగా తీసుకుంటారు. మెరిట్‌ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.

  • మొత్తం సీట్లలో 15 శాతం ఎస్సీ కేటగిరీ కింద ఉంటాయి. ఎస్సీ వర్గీకరణ వర్తిస్తుంది.

Updated Date - Jul 17 , 2025 | 05:00 AM