Share News

Deep Depression Over Bay of Bengal: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం

ABN , Publish Date - Sep 04 , 2025 | 03:23 AM

ఉత్తర ఒడిశాకు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి బుధవారం తీవ్ర అల్పపీడనంగా మారింది..

Deep Depression Over Bay of Bengal: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం

విశాఖపట్నం/అమరావతి, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): ఉత్తర ఒడిశాకు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి బుధవారం తీవ్ర అల్పపీడనంగా మారింది. వచ్చే 24 గంటల్లో ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్‌ మీదుగా వెళుతుందని వాతావరణశా ఖ తెలిపింది. దీని ప్రభావంతో బుధవారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. విశాఖ జిల్లా గాజువాకలో గంట నుంచి గంటన్నర సమయంలోనే 5.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో 5.4, వేంపాడులో 4.45 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Updated Date - Sep 04 , 2025 | 03:23 AM