Child Rights: బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నియామకాలకు దరఖాస్తుల గడువు పెంపు
ABN , Publish Date - Jun 20 , 2025 | 06:56 AM
రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఈ నెల 26వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు పొడిగించినట్టు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.
అమరావతి, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఈ నెల 26వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు పొడిగించినట్టు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 5న జారీ చేసిన నోటిఫికేషన్‌లో విద్యార్హతలను పోస్టు గ్రాడ్యుయేషన్‌గా సూచించామని, దానిని గ్రాడ్యుయేషన్‌కు సడలిస్తున్నామని శుక్రవారం ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు https://wdcw.ap.gov.in వెబ్‌సైట్ చూడాలని సూచించారు.