AP CM Chandrababu: ఆటో కార్మికులకు దసరా కానుక
ABN , Publish Date - Sep 11 , 2025 | 04:39 AM
కూటమి ప్రభుత్వం అందరి ప్రభుత్వం.. అన్ని వర్గాల జీవితాలు మార్చే ప్రభుత్వం.. మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల ఆటోడ్రైవర్లు నష్టపోకుండా వారందరికీ ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సాయం అందిస్తాం
ప్రతి ఒక్కరికీ ఏటా 15 వేలు
ఎన్నికల్లో చెప్పాం.. ఎన్ని కష్టాలున్నా అమలుచేస్తాం: ముఖ్యమంత్రి
అనంతపురం, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): ‘కూటమి ప్రభుత్వం అందరి ప్రభుత్వం.. అన్ని వర్గాల జీవితాలు మార్చే ప్రభుత్వం.. మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల ఆటోడ్రైవర్లు నష్టపోకుండా వారందరికీ ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సాయం అందిస్తాం. ఈ దసరా రోజునే అందజేస్తాం. ఎన్నికల్లో చెప్పాం.. ఎన్ని కష్టాలున్నా చేస్తాం. ఇదీ పేదలపై కూటమి ప్రభుత్వానికి ఉన్న ప్రేమ’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో హెల్తీ వెల్తీ హ్యాపీ సొసైటీ ఉండాలన్నది తన కోరికని, దానికోసమే పీ-4 తెచ్చామని అనంతపురంలో జరిగిన ‘సూపర్‌సిక్స్-సూపర్‌హిట్’ సభలో చెప్పారు. తన జీవితాంతం పేదవారి పక్షానే ఉంటానని, చివరి శ్వాస వరకు.. ప్రతి ఒక్క రక్తపు బొట్టూ పేదవారి కోసం చిందిస్తానని స్పష్టం చేశారు.