Dalit Youth : దళిత యువతతో కలిసి భోంచేయాలి
ABN , Publish Date - Jan 17 , 2025 | 04:04 AM
‘ఆదివాసీ మహిళ దేశ అత్యున్నత పీఠంపై కూర్చున్నారు. వెనుకబడిన వర్గాలకు చెందిన సామాన్యుడు ప్రధాని అయి దేశానికి సేవ చేస్తున్నారు. ఇదంతా డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం

‘సంవిధాన్ గౌరవ్ అభియాన్’ విజయవంతం కావాలి: పురందేశ్వరి
అమరావతి, జనవరి 16(ఆంధ్రజ్యోతి): ‘ఆదివాసీ మహిళ దేశ అత్యున్నత పీఠంపై కూర్చున్నారు. వెనుకబడిన వర్గాలకు చెందిన సామాన్యుడు ప్రధాని అయి దేశానికి సేవ చేస్తున్నారు. ఇదంతా డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ఫలితమే. అటువంటి రాజ్యాంగ నిర్మాతను కాంగ్రెస్ మోసగించింది. దీనిని రాష్ట్రంలోని ప్రతి ఊరు, వాడలో ప్రజలకు వివరించాలి’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. దేశవ్యాప్తంగా ఈ నెల 11 నుంచి 25 వరకూ బీజేపీ నిర్వహిస్తోన్న ‘సంవిధాన్ గౌరవ్ అభియాన్’ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎలా నిర్వహించాలనే అంశంపై గురువారం విజయవాడలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ‘బీజేపీ కార్యకర్తలు, స్థానిక నేతలు తమ పరిధిలోని హరిజనవాడలకు వెళ్లాలి. దళిత యువతతో సహపంక్తి భోజనాలు చేయాలి. కాంగ్రెస్ పార్టీ అంబేడ్కర్‌ను ఎన్నికల్లో ఓడించి మోసం చేసిన తీరును వివరించాలి’ అని సూచించారు.