Share News

SC Caste Classification : వర్గీకరణ పూర్తయ్యేవరకు రుణాలు నిలిపివేయాలి

ABN , Publish Date - Jan 17 , 2025 | 04:59 AM

ఎస్సీ వర్గీకరణ పూర్తయ్యేవరకు ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రుణాల మంజూరును నిలిపివేయాలని దళిత్‌ ఇండస్ట్రియల్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు

SC Caste Classification : వర్గీకరణ పూర్తయ్యేవరకు రుణాలు నిలిపివేయాలి

దళిత ఇండస్ట్రియల్‌ అసోసియేషన్‌ డిమాండ్‌

అమరావతి, జనవరి 16(ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణ పూర్తయ్యేవరకు ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రుణాల మంజూరును నిలిపివేయాలని దళిత్‌ ఇండస్ట్రియల్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేయడానికి కూటమి ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను వేసిందని, ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే రూ.340 కోట్లతో ఎస్సీలకు స్వయం ఉపాధి పథకాలు మంజూరు చేయడానికి కార్యాచరణ సిద్ధం చేశారని అసోసియేషన్‌ జాతీయ అధ్యక్షుడు మామిడి సుదర్శన్‌ గురువారం తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో ఆన్‌లైన్‌ ప్రక్రియ ద్వారా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా చేపట్టనున్నారని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ పూర్తి చేశాకే ఈ రుణాలను మంజూరు చేయాలని, లేకపోతే మాదిగ, రెల్లి తదితర కులాలవారికి అన్యాయం జరుగుతుందని తెలిపారు.

Updated Date - Jan 17 , 2025 | 04:59 AM