డి. బెళగల్ నుంచి జపానకు
ABN , Publish Date - Feb 12 , 2025 | 12:19 AM
మండలంలోని డి. బెళగల్ గ్రామానికి చెందిన పింజారి రసూల్ సాబ్, చాంద్‌బీ రెండో కుమారుడు హుశేన సాబ్ డిగ్రీ చదువుతున్నాడు.

ల్యాగ్రోస్ క్రీడలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన హుశేనసాబ్
ఫ పేదింటి నుంచి ఎదిగిన వైనం
ఫ దాతలు ఆదుకోవాలి .. క్రీడాకారుడి విజ్ఞప్తి
కోసిగి, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): మండలంలోని డి. బెళగల్ గ్రామానికి చెందిన పింజారి రసూల్ సాబ్, చాంద్‌బీ రెండో కుమారుడు హుశేన సాబ్ డిగ్రీ చదువుతున్నాడు. ఆంధ్రప్రదేశ రాష్ట్ర ల్యాగ్రోస్ క్రీడ అసోసియేషన ఆధ్వర్యంలో ఆగస్టులో మండల పరిధిలోని డి.బెళగల్ గ్రామంలో రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి ల్యాగ్రోస్ క్రీడ అసోసియేషన ఆధ్వర్యంలో క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన హుశేన సాబ్‌ను అంతర్జాతీయ స్థాయీ ల్యాగ్రోస్ పోటీలకు ఎంపికైనట్లు జాతీయ ల్యాగ్రోస్ అసోసియేషన నాయకులు తెలిపారు. ఈ నెల 17న జపాన దేశంలో జరిగే భారతదేశం ల్యాగ్రోస్ క్రీడా జట్టు తరపున హుశేనసాబ్ పోటీల్లో పాల్గొంటున్నారని తెలిపారు. అయితే హుశేన సాబ్ పేదింటి కుటుంబం కావడంతో ఆ దేశంలో క్రీడల్లో పాల్గొనేందుకు సుమారు రూ.2లక్షల దాకా ఖర్చు వస్తుందని, దాతలు ఎవరైనా ఆదుకుంటే అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణిస్తానని క్రీడాకారుడు హుశేనసాబ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు, దాతలు సహకరించి తనకు ఆర్థిక ఇబ్బందులనుంచి గట్టెక్కిస్తే అంతర్జాతీయ క్రీడాస్థాయిలో రాణించి దేశానికి మంచి పేరు తెస్తానని హుశేన సాబ్ తెలిపారు. హుశేనసాబ్ అంతర్జాతీయ క్రీడలకు ఎంపిక కావడం పట్ల కోసిగి మండల ప్రజలు, కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు. డీ.బెళగల్ గ్రామానకి చెందిన యూత ఆధ్వర్యంలో క్రీడాకారుడికి తమకు తోచినంత సాయం అందజేస్తామని తెలిపారు.