చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలి
ABN , Publish Date - Jan 06 , 2025 | 12:18 AM
చిరుధా న్యాల సాగు విస్తీర్ణంపై రైతులను ప్రోత్సహిం చాలని వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీరావు సూచించారు. ఆదివారం మండలంలోని కదిరి బత్తలపల్లిలో రైతు గుర్రప్ప సాగుచేసిన చీయా పంటను పరిశీలించారు.

కదిరి అర్బన, జనవరి 5(ఆంధ్రజ్యోతి): చిరుధా న్యాల సాగు విస్తీర్ణంపై రైతులను ప్రోత్సహిం చాలని వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీరావు సూచించారు. ఆదివారం మండలంలోని కదిరి బత్తలపల్లిలో రైతు గుర్రప్ప సాగుచేసిన చీయా పంటను పరిశీలించారు. రైతులతో ముఖాముఖి నిర్వహించారు. అలాగే మొటుకుపల్లి వద్దసాగు చేసిన టమాటా పంటలను పరిశీలించారు. యజమాన్య పద్ధతుల గురించి రైతులకు వివరిం చారు. గాండ్లపెంట మండలంలోని కటారు పల్లిలో రెడ్స్ సంస్థ నిర్వహిస్తున్న ప్రాసె సింగ్ యూనిట్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చిరుధాన్యాల సాగుపై రైతులను ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుం టోందన్నారు. చిరుధాన్యాలు సాగుతో రైతులకు లాభంతో పాటు, ప్రజలకు ఆరోగ్య కరమైన పంటలనూ సాగుచేసినట్లు ఉంటుం దన్నారు. ఆయన వెంట ఆర్డీఓ వీవీఎస్ శర్మ, వ్యవసాయి జిల్లా అధికారి సుబ్బారావు, ఉద్యాన శాఖ జిల్లా అధికారి చంద్రశేఖర్, కదిరి డివిజన ఏడీఏ సత్యనారాయణ, ఏఓ శ్రీనివాసరెడ్డి, ఉద్యానశాఖ ప్రతాప్‌రెడ్డి, ఏపీసీడ్స్ మేనేజర్ వెంకట సుబ్బ య్య, రైతు సేవా కేంద్రం సిబ్బంది, రెడ్స్ సంస్థ అధ్యక్షురాలు భానుజా, సిబ్బంది ఉన్నారు.