CS : ఉగాది నుంచి పీ-4 విధానం
ABN , Publish Date - Feb 07 , 2025 | 04:28 AM
రాష్ట్రంలో వచ్చే ఉగాది నుంచి పబ్లిక్- ప్రైవేట్- పీపుల్స్- పార్టనర్‌షిప్ (పీ-4) విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వెల్లడించారు. గురువారం అమరావతి సచివాలయంలో పీ-4 విధానంపై సంబంధిత అధికారులతో సీఎస్ సమీక్ష జరిపారు. జిల్లా కలెక్టర్లు వర్చువల్‌గా

విధివిధానాల రూపకల్పనకు ప్రజల సలహాల స్వీకరణ: సీఎస్
అమరావతి, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వచ్చే ఉగాది నుంచి పబ్లిక్- ప్రైవేట్- పీపుల్స్- పార్టనర్‌షిప్ (పీ-4) విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వెల్లడించారు. గురువారం అమరావతి సచివాలయంలో పీ-4 విధానంపై సంబంధిత అధికారులతో సీఎస్ సమీక్ష జరిపారు. జిల్లా కలెక్టర్లు వర్చువల్‌గా పాల్గొన్నారు. సీఎస్ మాట్లాడుతూ పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పీ-4 విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. ‘ముఖ్యంగా సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న 10ు మంది పేదరికంలో అట్టడుగు స్థాయిలో ఉన్న 20ు మందికి చేయూతనివ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. దీని అమలు కోసం విధివిధానాల రూపకల్పనకు ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించడంతో పాటు ఇందుకోసం ప్రత్యేక పోర్టల్ కూడా రూపొందిస్తాం’ అని పేర్కొన్నారు. పేదలకు సాయం చేసేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలు, ఎన్నారైలను ఉగాది రోజు పీ-4 ప్రారంభకార్యక్రమానికి ఆహ్వానిస్తామని సీఎస్ తెలిపారు. ప్రతి ఏటా 15ు వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో 500 కంప్రెస్ట్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు రిలయన్స్ సంస్థ ముందుకొచ్చిన నేపథ్యంలో వీటి ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు.