Share News

‘అదానీ’తో పంటలు సర్వనాశనం: సీపీఎం

ABN , Publish Date - Mar 07 , 2025 | 12:01 AM

మండల సరిహద్దులోని దాడితోట గ్రామం వద్ద అదానీ పవర్‌పాయింట్‌ నిర్మాణ పనుల వల్ల వస్తున్న దుమ్ము పడి దాడితోట గ్రామానికి చెందిన అరటి, చీనీ పంటలు సర్వనాశనం అవుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాంభూపాల్‌, ఉమ్మడి జిల్లా రైతుసంఘం అధ్యక్షుడు జంగాలపల్లి పెద్దన్న మండిపడ్డారు.

‘అదానీ’తో పంటలు సర్వనాశనం: సీపీఎం
దెబ్బతిన్న అరటి తోటను పరిశీలిస్తున్న సీపీఎం నేత రాంభూపాల్‌

తాడిమర్రి, మార్చి 6(ఆంధ్రజ్యోతి): మండల సరిహద్దులోని దాడితోట గ్రామం వద్ద అదానీ పవర్‌పాయింట్‌ నిర్మాణ పనుల వల్ల వస్తున్న దుమ్ము పడి దాడితోట గ్రామానికి చెందిన అరటి, చీనీ పంటలు సర్వనాశనం అవుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాంభూపాల్‌, ఉమ్మడి జిల్లా రైతుసంఘం అధ్యక్షుడు జంగాలపల్లి పెద్దన్న మండిపడ్డారు. గురువారం దాడితోట గ్రామ పొలాలను పరిశీలించారు. కొండను తవ్వి మట్టిని ఎత్తిపోయడం మూలంగా వస్తున్న దూళి తమ పొలాలపై పడి పంట పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు శ్రీనివాసరెడ్డి, అరవిందరెడ్డి, చిన్నసుబ్బిరెడ్డి వాపోయారు. చివరికి పంటకొనడానికి కూడా వ్యాపారులు ఎవరూ ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొండ పనులు ప్రారంభించినప్పటీ నుంచి అదిగో ఇస్తామని, ఇదిగో ఇస్తామని చెప్పి ఇంతవరకు ఎవరికి పరిహారం ఇవ్వలేదన్నారు. రాంభూపాల్‌ మాట్లాడుతూ.. పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అదానీ కంపెనీ ఇస్తుందా.. ప్రభుత్వం అందిస్తుందా అన్న విషయంపై స్పష్టత ఇవ్వాలని కోరారు. వచ్చే సోమవారం లోపు అధికారులు, అదానీ ప్రతినిధులు నష్టపోయిన రైతులకు పరిహారం అందజేయలని, లేకుంటే రైతులతో కలిసి కలెక్టరేట్‌కు వెళ్లతామని అన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. ఆ తర్వాత చిల్లకొండయ్యపల్లి గ్రామంలో రైతులతో మాట్లాడారు. అదానీ కంపెనీ వారు గుట్టలు పగలగొట్టేందుకు పేలుళ్ల మూలంగా బోర్లు పూడిపోతున్నాయని ఆ రైతులు వాపోయారు. భూగర్భ జలాలూ అడుగింటిపోతున్నాయన్నారు. కార్యక్రమంలో సీపీఎం సీనియర్‌ నాయకుడు ఎస్‌హెచ బాషా, మండల నాయకులు నారాయణ, నాగార్జున, ఆదినారాయణ పాల్గొన్నారు.

Updated Date - Mar 07 , 2025 | 12:01 AM