అడవి పందులతో పంటల నాశనం
ABN , Publish Date - Mar 07 , 2025 | 12:05 AM
మండలంలోని కురమాలపల్లి గ్రామ రైతు సుధాకర్‌రెడ్డి సాగుచేసిన మొక్కజొన్నతోట బుధవారం రాత్రి అడవి పందులు ధ్వంసం చేశా యి.

తనకల్లు, మార్చి 6(ఆంధ్రజ్యోతి): మండలంలోని కురమాలపల్లి గ్రామ రైతు సుధాకర్‌రెడ్డి సాగుచేసిన మొక్కజొన్నతోట బుధవారం రాత్రి అడవి పందులు ధ్వంసం చేశా యి. బాధితుడు మాట్లాడు తూ.. రెండు ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగుచేశానని, బుధవారం రాత్రి ఆలస్యంగా పొలానికి వెళ్లానని, అప్పటికే అడవిపందులు ఎకరం మొక్కజొన్న పంటను నాశనం చేశాయని వాపోయారు. దీంతో రూ.రెండు లక్షలకుపైగా నష్టం జరిగిందన్నారు. అప్పులు చేసి పంట సాగుచేస్తే జింకలు, నెమళ్ల, అడవి పందులు పంటలను నాశనం చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం అడవి జంతువుల బారి నుంచి పంటలను రక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తనను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. నాశనమైన ఆ పొలాన్ని ఎంపీఈఓ కీర్తన పరిశీలించారని, నష్టాన్ని అంచనావేసి ప్రభుత్వానికి నివేదిక పంపుతామని ఏఓ శ్రీహరినాయక్ తెలిపారు.