Share News

Panchayat Raj : పంచాయతీరాజ్‌లోనూ ‘అంచనాలను’ సవరించవచ్చు

ABN , Publish Date - Jan 17 , 2025 | 04:35 AM

మూడు తాగునీటి పథకాల అంచనాలను జల వనరుల ప్రాజెక్టుల తరహాలోనే సవరించుకోవచ్చు అంటూ గత నెల 16న పంచాయతీరాజ్‌ శాఖ జారీచేసిన జీవో నంబరు 72 విమర్శలకు తావిస్తోంది. ఉద్దానం, పులివెందుల, డోన్‌... మూడు మంచినీటి పథకాలను 2021 నవంబరు 30లోగా పూర్తి

Panchayat Raj : పంచాయతీరాజ్‌లోనూ ‘అంచనాలను’ సవరించవచ్చు

ఆ శాఖ జారీ చేసిన జీవో 72పై సర్వత్రా అభ్యంతరాలు

అమరావతి, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): మూడు తాగునీటి పథకాల అంచనాలను జల వనరుల ప్రాజెక్టుల తరహాలోనే సవరించుకోవచ్చు అంటూ గత నెల 16న పంచాయతీరాజ్‌ శాఖ జారీచేసిన జీవో నంబరు 72 విమర్శలకు తావిస్తోంది. ఉద్దానం, పులివెందుల, డోన్‌... మూడు మంచినీటి పథకాలను 2021 నవంబరు 30లోగా పూర్తి చేస్తామని కాంట్రా క్టు సంస్థ ఒప్పందం చేసుకుంది. కానీ.. ఇప్పటి వరకూ పూర్తి చేయలేదు. ఈ పనులు పూర్తి చేయడానికి తాజా ఎస్‌ఎ్‌సఆర్‌ మేరకు అంచనాలను సవరించాలని కాంట్రాక్టు సంస్థ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు గత నెల 16న జీవో 72ను పంచాయతీరాజ్‌ శాఖ జారీ చేసింది. జల వనరుల శాఖ తరహాలోనే అంచనాలు సవరించుకోవడానికి పంచాయతీ రాజ్‌ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌కు ఈ జీవో అనుమతిస్తోంది. దీనిని అమలు చేస్తే ఆ శాఖలోని ఇతర పనులకూ ఇవే ఆదేశాలు వర్తిస్తాయి. ఫలితం... ప్రభుత్వంపై రూ.1,000 కోట్ల ఆర్థిక భారం పడుతుందని ఆ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Updated Date - Jan 17 , 2025 | 04:35 AM