కేంద్ర బడ్జెట్‌పై సీపీఎం నిరసన
ABN , Publish Date - Feb 03 , 2025 | 12:22 AM
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం చేశారని సీపీఎం నాయకులు అన్నారు.

కర్నూలు న్యూసిటీ, ఫిబ్రవరి 2(ఆం ధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం చేశారని సీపీఎం నాయకులు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సీపీఎం అధ్వర్యంలో నగరంలోని పలు ప్రాంతాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆదివారం సుందరయ్య కూడలి, వీకర్ సెక్షన కాలనీ, పూలబజార్ పొట్టిశ్రీరాములు విగ్రహల వద్ద నిరసన చేశారు. నగర కార్యదర్శివర్గసభ్యుడు కే.సుధాకరప్ప మాట్లాడుతూ ప్రత్యేక హోదా, విభజన హామీలు, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి తదితర అంశాలను పక్కనబెట్టి ఏపీకి అన్యాయం చేశారని ఆరోపించారు. విశాఖ రైల్వే జోన, ఎనఐటీ, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐఎ్‌సఈఆర్, గిరిజన యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, దుగరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్, వైజాక్ మెట్రో, ఎయిమ్స్, రాజధాని నిర్మాణం తదితర వాటికి నిధుల ఊసేలేదన్నారు. ప్రపంచ బ్యాంకు రుణాన్ని పదేపదే ప్రస్తావించారు తప్ప కొత్తగా కేటాయించలేదని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌కు గత ఏడాది రూ.5.512కోట్లు కేటాయిస్తే ఈసారి రూ.5,936 కేటాయించినట్లు తెలిపారు. పునరావాసం, పరిహారం ప్యాకేజీని పట్టించుకోలేదన్నారు. కేంద్ర బడ్జెట్‌కు నిరసనగా ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆర్.నరసింహులు, సీహెచ.సాయిబాబ, శ్యామలమ్మ, రహిమాన,ఎ్‌సఎండి.షరీ్‌ఫ, అబ్దుల్ దేశాయ్, రామక్రిష్ణ పాల్గొన్నారు.