Share News

CPIs Ramakrishna Slams Modi Government: దొంగ ఓట్లు, దొంగ నోట్లతో మోదీ పాలన

ABN , Publish Date - Aug 13 , 2025 | 04:28 AM

కేంద్రంలో దొంగ ఓట్లు, దొంగ నోట్ల ప్రభుత్వాన్ని మోదీ నడిపిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు....

CPIs Ramakrishna Slams Modi Government: దొంగ ఓట్లు, దొంగ నోట్లతో మోదీ పాలన

  • సీపీఐ రామకృష్ణ

అనంతపురం విద్య, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): కేంద్రంలో దొంగ ఓట్లు, దొంగ నోట్ల ప్రభుత్వాన్ని మోదీ నడిపిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. అనంతపురంలో ఆ పార్టీ 25వ జిల్లా మహాసభలు మంగళవారం ప్రారంభం కాగా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. మోదీ 11 ఏళ్ల పాలనలో పేద ప్రజలు ఎవరూ బాగపడలేదని, పెట్టుబడిదారులు మాత్రమే మరింత అభివృద్ధి చెందుతున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్‌ను కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకుందని రామకృష్ణ ఆరోపించారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు అభివృద్ధి ముసుగులో పెద్దఎత్తున అప్పులు చేస్తున్నారని అన్నారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో మూడురోజులు పాటు ఒంగోలులో సీపీఐ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తామని రామకృష్ణ వెల్లడిం

Updated Date - Aug 13 , 2025 | 04:28 AM