High Court : పత్తి కొనుగోలు అధికారులపై కోర్టు ధిక్కరణ పిటిషన్
ABN , Publish Date - Jan 30 , 2025 | 04:51 AM
కాటన్ జిన్నింగ్ మిల్లులు/ సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయడంలేదని, అందుకు బాధ్యులైన అధికారులను శిక్షించాలంటూ దాఖలైన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ

సీసీ కెమెరాలు ఏర్పాటు చేయని ఫలితం
అమరావతి, జనవరి 29(ఆంధ్రజ్యోతి): కాటన్ జిన్నింగ్ మిల్లులు/ సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయడంలేదని, అందుకు బాధ్యులైన అధికారులను శిక్షించాలంటూ దాఖలైన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను మార్చి 12కి వాయిదా వేసింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పత్తిలో నాణ్యత లేదని, తేమ శాతం అధికంగా ఉందని పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులను దోపిడీ చేస్తున్నారు. తూకాలలో కూడా తేడాలు చేస్తున్నారంటూ గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరానికి చెందిన బి.అశోక్, సీసీఐ మాజీ మేనేజర్ గుంటూరుకు చెందిన సాయి ఆదిత్య హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాల మేరకు పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని గుంటూరు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా అమలు కావడం లేదన్నారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు పత్తి జిన్నింగ్ కేంద్రాలు/ పత్తి కొనుగోలు కేంద్రాలను అనుసంధానం చేస్తూ వారం రోజుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని గుంటూరు మార్కెటింగ్ అసిస్టెంట్ డైరెక్టర్, గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శిని ఆదేశిస్తూ గత ఏడాది డిసెంబరు 16న తీర్పు ఇచ్చారు. ఈ ఉత్తర్వులను అధికారులు అమలు చేయకపోవడంతో పిటిషనర్లు తాజాగా కోర్టుధిక్కరణ పిటిషన్ వేశారు. గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి, ఏపీ ఫైబర్‌నెట్ ఎండీ కె.దినే్‌షకుమార్, గుంటూరు మార్కెటింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ బి.రాజబాబు, గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి ఆంజనేయులను ప్రతివాదులుగా చేర్చారు. ఈ కోర్టుధిక్కరణ పిటిషన్ బుధవారం విచారణకు వచ్చింది.
మరిన్నీ తెలుగు వార్తల కోసం..
Also Read: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర మంత్రులు.. అసలు విషయం ఇదే
Also Read: పంచగ్రామాల ప్రజలకు గుడ్ న్యూస్
Also Read: ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టను రట్టు చేసిన పోలీసులు
Also Read: మీకు వాట్సాప్ ఉంటే చాలు.. మీ ఫోన్‌లోనే ప్రభుత్వం
Also Read: జాతీయ క్రీడల జరుగుతోన్న వేళ.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు
Also Read: హైకోర్టు తీర్పుపై స్పందించిన జ్యోతి సురేఖ