Share News

land Disputes: నిషేధిత భూముల జాబితాలోకి సివిల్‌ కోర్టు ఎటాచ్‌మెంట్లు

ABN , Publish Date - Jul 10 , 2025 | 04:41 AM

భూవివాదాలకు సంబంధించి సివిల్‌ కోర్టులు ఇచ్చే ఎటాచ్‌మెంట్లను నిషేధిత భూముల జాబితాలోని 22సీ విభాగంలో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

land Disputes: నిషేధిత భూముల జాబితాలోకి సివిల్‌ కోర్టు ఎటాచ్‌మెంట్లు

  • దొంగ రిజిస్ర్టేషన్ల రద్దుకు కలెక్టర్‌ ఆధ్వర్యంలో కమిటీలు

  • ఫ్రాంచైజీ అగ్రిమెంట్ల చార్జీలు పెంపు.. జీవోలు జారీ

అమరావతి, జూలై 9(ఆంధ్రజ్యోతి): భూవివాదాలకు సంబంధించి సివిల్‌ కోర్టులు ఇచ్చే ఎటాచ్‌మెంట్లను నిషేధిత భూముల జాబితాలోని 22సీ విభాగంలో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే కోర్టు ఉత్తర్వుల ద్వారా అటాచ్‌ చేసిన భూములు రిజిస్ర్టేషన్‌ చేయరు. కోర్టు ఇచ్చే ఈ ఉత్తర్వు ద్వారా ఒక భూమి లేదా భవనం వంటివి కోర్టు నియంత్రణలోకి వెళ్తాయి. ఇక నుంచి ఈ అటాచ్‌మెంట్‌ కారణంగా ఆ ఆస్తిని విక్రయించడానికి లేదా బదిలీ చేయడానికి వీలులేకుండా 22సీ విభాగంలో ఉంచుతున్నారు. కాగా, కేఎఫ్‌సీ, డోమినోస్‌, లెన్స్‌కార్ట్‌ లాంటి కంపెనీలు ఫ్రాంచైజీలు ఇస్తుంటాయి. ఈ ఫ్రాంచైజీ అగ్రిమెంటు చార్జీలు గతంలో రూ.100 మాత్రమే ఉండేవి. కానీ, ఇప్పుడు ఈ చార్జీలను సవరించారు. లైసెన్సు సమయం ఏడాది లోపు ఉంటే చార్జీలు రూ.1000, ఏడాది నుంచి పదేళ్లలోపు ఉంటే ఏడాదికి రూ.1000 చొప్పున, పదేళ్లకు పైగా ఉంటే రూ.25,000గా నిర్ణయించారు.

Updated Date - Jul 10 , 2025 | 04:41 AM