P.S.R. Controversy: నాడు డాక్టర్.. నేడు యాక్టర్
ABN , Publish Date - Apr 25 , 2025 | 04:13 AM
పీఎస్‌ఆర్ పై మహిళా వేధింపుల ఆరోపణలు, దాని నేపథ్యంలో జైలుకి వెళ్లిన ఘటనలు రాజకీయంగా కూడా తీవ్ర ప్రతికూలతలు కలిగించాయి. విజయవాడలో పీఎస్‌ఆర్ మరియు వంశీకి మధ్య జరిగిన వివాదాలు, ఇప్పుడు ఇద్దరు ఒకే జైలులో ఉన్నారు.
పీఎ్‌సఆర్‌ను వెంటాడుతున్న ‘స్ర్తీ గండం’
సీపీ హోదాలో నాడు లైంగిక వేధింపుల ఆరోపణలు
బదిలీ వేటు వేసిన డిపార్ట్‌మెంట్
నిఘా బాస్‌గా జత్వానిపై కేసుకు కుట్ర!
ఈసారి ఏకంగా జైలుకే..
రెండు ఘటనలకూ విజయవాడే కేంద్రం
(విజయవాడ-ఆంధ్రజ్యోతి)
కొందరికి వాహన గండం ఉంటుంది. మరికొంతమందికి జలగండం ఉంటుంది. కానీ, ఐపీఎస్ అధికారి పెండ్యాల సీతారామాంజనేయులుకు (పీఎ్‌సఆర్) మాత్రం మహిళా గండం ఉన్నట్టు కనిపిస్తోంది. మహిళల విషయంలోనే ఆయన పరువు రెండు సార్లు బజారున పడింది. ఈ రెండు ఘటనలూ విజయవాడ కేంద్రంగానే జరగడం గమనార్హం. విజయవాడ పోలీసు కమిషనర్ హోదాలో పనిచేసినప్పుడు అసభ్యకరంగా సందేశాలు పంపి వేధించారని ఓ మహిళా వైద్యురాలు రోడ్డు ఎక్కడంతో పీఎ్‌సఆర్ శాఖపరంగా ఇబ్బందిపడ్డారు. ముంబై నటి కాదంబరి జత్వానిపై అక్రమంగా కేసును బనాయించడం వెనుక వ్యూహకర్తగా ఉండి ఇప్పుడు ఏకంగా జైలుకే వెళ్లారు. ఉమ్మడి రాష్ట్రంలో 2011లో పోలీసు కమిషనర్‌గా విజయవాడకు పీఎ్‌సఆర్ వచ్చారు. ఆనాడు గన్నవరం నియోజకవర్గం పోలీసు కమిషనరేట్ పరిధిలో ఉండేది. అప్పుడు తెలుగుదేశం గన్నవరం ఎమ్మెల్యేగా వల్లభనేని వంశీ ఉన్నారు. ఆ రోజుల్లో వంశీ వాహనంలో బయటకు బయలుదేరితే భారీ కాన్వాయ్ ఉండేది. ఆయన కారు కాకుండా మరో ఆరేడు కారులు వెనుకాముందు ఉండేవి. దీనిపై పీఎ్‌సఆర్ పంజా విసిరారు. వంశీ కాన్వాయ్‌లో వాహనాలను పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. దీంతో పీఎ్‌సఆర్, వంశీ మధ్య వైరానికి బీజం పడింది. ఆ తర్వాత ఒక సెటిల్‌మెంట్ వ్యవహారం వారిమధ్య దూరాన్ని మరింతగా పెంచిందని చెబుతుంటారు. అన్నపూర్ణ ప్యాకర్స్ విషయంలో ఒకవర్గానికి వంశీ కొమ్ముకాయగా, మరో వర్గానికి పీఎ్‌సఆర్ అభయం ఇచ్చారు. ఈ విషయంలోనూ ఒకరికొకరు హెచ్చరికలు జారీ చేసుకున్నారు. ఇది జరిగిన కొన్నాళ్లకు పీఎస్‌ఆర్ తనను లైంగికంగా వేధిస్తున్నారని ఒక మహిళా వైద్యురాలు ఆరోపణలు చేశారు. ఆయన పంపిన సందేశాలను ఉన్నతాధికారులకు చూపించారు. అప్పటి వరకు పులిలా కనిపించిన పీఎస్‌ఆర్ పిల్లిలా మారిపోయారు. వంశీయే ఆ మహిళను పీఎ్‌సఆర్‌పైకి బాణంలా వదిలారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ వ్యవహారంతో పీఎ్‌సఆర్‌ను పోలీసు ఉన్నతాధికారులు ఆగమేఘాల మీద బదిలీ చేశారు.
జత్వాని ఝలక్
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాగానే పీఎస్‌ఆర్ ప్రాధాన్యం తిరిగి పెరిగిపోయింది. ఇంటెలిజెన్స్ విభాగాధిపతిగా పేట్రేగిపోయారు. జగన్ ‘అంజన్న’ అని పిలిచేంతగా అప్పటి ప్రభుత్వ పెద్దలతో కలిసి వ్యవహారాలు నడిపించారు. 2024 ఎన్నికలకు ముందు ముంబై నటి కాదంబరి జత్వానిపై అక్రమంగా కేసు నమోదు చేయించడంలో తెర వెనుక వ్యూహం రూపొందించారు. తానే నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి జత్వానీపై కుక్కల విద్యాసాగర్‌తో కేసు పెట్టించారు. ఐపీఎస్ స్థాయి అధికారులను ముంబై పంపించి, జత్వాని, ఆమె కుటుంబ సభ్యులను విజయవాడకు తీసుకొచ్చేలా ప్రణాళిక రూపొందించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత జత్వాని కేసులో ఆయన ఇప్పుడు కటకటాలు లెక్కిస్తున్నారు.
కొసమెరుపు: ఒకనాడు ‘ఆధిపత్య’ పోరు సాగించిన వంశీ, పీఎ్‌సఆర్ ఇప్పుడు విజయవాడలో ఒకే జైలులో ఉన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి, ఉద్యోగి అపహరణ కేసుల్లో వంశీ కటకటాలు లెక్కిస్తుంటే, ఒక నటిని బలవంతంగా అరెస్టు చేసి వేధింపులకు గురిచేసిన కేసులో పీఎ్‌సఆర్ కారాగారానికి వెళ్లారు.
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..