Ram Gopal Varma : నేడు ఒంగోలులో పోలీసు విచారణకు ఆర్జీవీ
ABN , Publish Date - Feb 07 , 2025 | 04:33 AM
వివాదాస్పద సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ శుక్రవారం ఒంగోలు రూరల్ పోలీసు స్టేషన్‌లో జరిగే విచారణకు హాజరుకానున్నారు. ఉదయం 7 గంటలకు ఒంగోలు రూరల్ సర్కిల్ కార్యాలయంలో

ఒంగోలుక్రైం, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): వివాదాస్పద సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ శుక్రవారం ఒంగోలు రూరల్ పోలీసు స్టేషన్‌లో జరిగే విచారణకు హాజరుకానున్నారు. ఉదయం 7 గంటలకు ఒంగోలు రూరల్ సర్కిల్ కార్యాలయంలో విచారణ జరగనుంది. అందుకు సంబంధించి పోలీసులు పటిష్ఠంగా భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌ల ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ఆర్జీవీ పోస్టు చేశారు. దీనిపై గతేడాది నవంబరు 10న ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో శుక్రవారం వర్మ పోలీసుల ముందుకు రానున్నారు.