Share News

కొనసాగిన యజ్ఞం

ABN , Publish Date - Feb 24 , 2025 | 11:46 PM

ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంతులో 11వ రోజైన సోమవారమూ అతిరుద్ర మహాయజ్ఞం కొనసాగింది. వేదపడింతులు మహాగణపతితో యజ్ఞాన్ని కొనసాగించారు

కొనసాగిన యజ్ఞం
యజ్ఞాన్ని నిర్వహిస్తున్న పండితులు

పుట్టపర్తి, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంతులో 11వ రోజైన సోమవారమూ అతిరుద్ర మహాయజ్ఞం కొనసాగింది. వేదపడింతులు మహాగణపతితో యజ్ఞాన్ని కొనసాగించారు. శివలింగానికి అభిషేకాలు నిర్వహించారు. యజ్ఞం లో సర్వదేవతా అర్చన చేశారు. సాయంత్రం గౌరీశంకర వివాహ కార్యక్రమాన్ని సంగీత కచేరి ద్వారా నిర్వహించారు. ప్రముఖ సంగీత గాయకులు కార్తీక్‌, జ్ఞానేశ్వర్‌ భగవతార్‌ బృందం మధుర గానంతో భక్తులను అలరింపచేశారు. అనంతరం సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.

Updated Date - Feb 24 , 2025 | 11:46 PM