Share News

సేంద్రియ సాగుపై సమావేశం

ABN , Publish Date - Feb 12 , 2025 | 12:11 AM

మండలంలో పలువురు రైతులు చేస్తున్న సేంద్రియ సాగుపై పోలో ఇండియా ప్రతినిధులు ఆరా తీశారు.

సేంద్రియ సాగుపై సమావేశం
రైతులతో మాట్లాడుతున్న పోలో ఇండియా ప్రతినిధులు

తనకల్లు, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): మండలంలో పలువురు రైతులు చేస్తున్న సేంద్రియ సాగుపై పోలో ఇండియా ప్రతినిధులు ఆరా తీశారు. మంగళవారం మండలంలోని తవళం ఆంజనేయస్వామి ఆలయం వద్ద మండలంలోని రత్నగిరి రైతు సంఘం, గంగసానిపల్లి, పెద్దపల్లి, గౌళ్లపల్లి, నల్లకొండవంక, గంగమ్మ వంక, ఈదులవంక సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఇందులో పోలో ఇండియాతో పాటు వాసన, జనజాగృతి ప్రతినిధులు శ్వేత, హరిజితమిశ్రా పాల్గొన్నారు. మండలంలో ప్రస్తుతం రైతు సంఘాలు చేపడుతున్న వివిధ కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. పురుగుమందులు, రసాయన ఎరువుల వాడకం తగ్గిం చడం.. సేంద్రియ సాగు.. సంఘాల ద్వారా చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను రైతు సంఘాల నాయకులు వారికి వివరించారు. పోలో ఇండియా ప్రతినిధులు మాట్లాడుతూ.. తమ సంస్థ మండలంలోని కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని.. సేంద్రియసాగు చేసేలా కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో జనజాగృతి అధ్యక్షుడు బలరాం, ఈడీ రాంప్రసాద్‌, వాసన ప్రతినిధి ఉత్తప్ప, రైతు సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2025 | 12:11 AM