బియ్యం కోసం ఆందోళన
ABN , Publish Date - Feb 12 , 2025 | 12:09 AM
తమకు గత, ఈ నెల రేషన బియ్యం కొంతమందికే పంపిణీ చేశారని, కార్డుదారులందరికీ అవి సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని మండలంలోని వడ్డుమరవపల్లి గ్రామస్థులు డిమాండ్ చేశారు.

తనకల్లు, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): తమకు గత, ఈ నెల రేషన బియ్యం కొంతమందికే పంపిణీ చేశారని, కార్డుదారులందరికీ అవి సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని మండలంలోని వడ్డుమరవపల్లి గ్రామస్థులు డిమాండ్ చేశారు. మంగళవారం ఈ మేరకు వారు తహసీల్దార్ కార్యాల యం వద్ద ఆందోళన చేపట్టారు. మంగళవారం చౌక బియ్యం వాహనం ద్వారా కేవలం మూడు బస్తాల బియ్యాన్ని మాత్రమే తీసుకొచ్చారని, గత నెలల కూడా ఇలాగే అరకొరగా ఇచ్చి వెళ్లిపోయారని వాపోయారు. దీనిపై ఆ వాహనం దారుడిని ప్రశ్నిస్తే.. దురుసుగా ప్రవర్తిస్తున్నాడని వాపోయారు. దీంతో తాము పనులు మాసేసి.. 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న తనకల్లుకు వచ్చి.. ఆందోళన చేపడుతున్నామన్నారు. డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జున మాట్లాడుతూ 24 గంటలలోపు గ్రామంలోని కార్డుదారులు అందరికీ బియ్యం అందించాలని చౌక బియ్యం వాహనదారుడికి ఆదేశించినట్లు చెప్పారు.