Share News

Machinery Survey: త్వరలో వ్యవసాయ యంత్రాల సమగ్ర సర్వే

ABN , Publish Date - Jul 28 , 2025 | 04:57 AM

భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా గ్రామ వ్యవసాయ యంత్రాల సమగ్ర సర్వేను త్వరలో ప్రారంభించనున్నట్టు వ్యవసాయశాఖ డైరెక్టర్‌ డిల్లీరావు తెలిపారు.

Machinery Survey: త్వరలో వ్యవసాయ యంత్రాల సమగ్ర సర్వే

  • ఆగస్టు 31లోగా పూర్తి: అగ్రికల్చర్‌ డైరెక్టర్‌ డిల్లీరావు

అమరావతి, జూలై 27(ఆంధ్రజ్యోతి): భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా గ్రామ వ్యవసాయ యంత్రాల సమగ్ర సర్వేను త్వరలో ప్రారంభించనున్నట్టు వ్యవసాయశాఖ డైరెక్టర్‌ డిల్లీరావు తెలిపారు. ఆగస్టు 31లోగా ఈ సర్వే పూర్తి చేయనున్నట్లు ఆదివారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రైతుసేవా కేంద్రాల ద్వారా వ్యవసాయ సహాయకులు ఈ సర్వే నిర్వహిస్తారని తెలిపారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, ప్రాథమిక సహకార సంఘాలు, ప్రైవేట్‌ సంస్థల వద్ద ఉన్న యంత్రాలను గుర్తించి రాయితీ, వ్యక్తిగత కొనుగోలు వంటి అంశాలను నమోదు చేస్తారని వెల్లడించారు. ఈ సర్వే ద్వారా పంట విస్తీర్ణం, సాగుకు అవసరమైన పరికరం, యంత్రాల లభ్యత, పరికరం వాడకపు స్థితి వంటి వివరాలు తేలితే, గ్రామ అవసరాన్ని బట్టి ప్రత్యేక బడ్జెట్‌ ప్రణాళికలు రూపొందించడానికి వీలవుతుందని తెలిపారు. డ్రిప్‌, స్పింక్లర్‌, పిచికారి, కోత అనంతర పరికరాల వివరాలను సేకరిస్తామన్నారు. ఈ సర్వే వివరాలను ఏపీ అగ్రికల్చర్‌ ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌(ఏపీ ఎయిమ్‌2.0), కృత్రిమ మేధ, ఈ-సీహెచ్‌సీ ఫ్లాట్‌ఫామ్‌, కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్స్‌, వ్యవసాయ యాంత్రీకరణ సబ్‌ మిషన్‌ పథకం, పీఎం కిసాన్‌ వంటి రైతు సంబంధ పోర్టల్స్‌కు అనుసంధానిస్తామని తెలిపారు. వ్యక్తిగత, సంస్థాగత, రైతుసేవా కేం ద్రాల స్థాయిలో యంత్రాల డిజిటల్‌ జాబితాను రూపొందిస్తామని చెప్పారు. దీనివల్ల వాస్తవ లబ్ధిదారు, వాస్తవ వినియోగం, బుకింగ్‌, చెల్లింపు వంటి ట్రాకింగ్‌ వ్యవస్థ ఏర్పడుతుందని, డ్రోన్‌ ఆధారిత స్ర్పేయింగ్‌ యంత్రాల విస్తరణకు ఈ సర్వే సమాచారం దోహదపడుతుందని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఏపీలో పెట్టుబడులకు సింగపూర్ గ్రీన్ సిగ్నల్.. ప్రధానంగా ఈ రంగాల్లో

బద్వేల్‌లో ఉప ఎన్నిక‌.. ఆదినారాయణరెడ్డి ఏమన్నారంటే..

Read latest AP News And Telugu News

Updated Date - Jul 28 , 2025 | 04:58 AM