చాట్రాయి తహసీల్దార్‌పై సీఎంకు ఫిర్యాదు
ABN , Publish Date - Jan 04 , 2025 | 12:46 AM
చాట్రాయి తహసీల్దార్ వ్యవహారశైలిపై సీఎం చంద్రబాబు నాయుడుకు చాట్రాయి మండల తెలుగు తమ్ముళ్లు ఫిర్యాదు చేశారు. అమరావతిలో సీఎంను కలిసిన మండల తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కళ్ళేపల్లి ప్రభాకర్ తహసీల్దార్ వ్యవహారశైలిపై ఫిర్యాదు చేశారు.

నూజివీడు, జనవరి 3 (ఆంధ్ర జ్యోతి): చాట్రాయి తహసీల్దార్ వ్యవహారశైలిపై సీఎం చంద్రబాబు నాయుడుకు చాట్రాయి మండల తెలుగు తమ్ముళ్లు ఫిర్యాదు చేశారు. అమరావతిలో సీఎంను కలిసిన మండల తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కళ్ళేపల్లి ప్రభాకర్ తహసీల్దార్ వ్యవహారశైలిపై ఫిర్యాదు చేశారు. ఆమె తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఫారెస్ట్ భూములను, రెవెన్యూ రికార్డుల్లో లేని భూములను రికార్డులు తారుమారు చేసి లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటోందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. తహసీల్దార్‌పై ఆరు ఆరోపణలు చేస్తూ సీఎంకు ఫిర్యాదు చేశారు.