Share News

తోపుదుర్తి చందుపై ఫిర్యాదు

ABN , Publish Date - Jan 04 , 2025 | 11:47 PM

టీడీపీ అధినేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు, ప్రస్తుత మంత్రి నారా లోకేష్‌ను రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్న తోపుదుర్తి చందు గతంలో అసభ్య పదజాలంతో తిట్టారని టీడీపీ నాయకులు అన్నారు.

తోపుదుర్తి చందుపై ఫిర్యాదు
పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న టీడీపీ నాయకులు

బత్తలపల్లి, జనవరి 4(ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు, ప్రస్తుత మంత్రి నారా లోకేష్‌ను రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్న తోపుదుర్తి చందు గతంలో అసభ్య పదజాలంతో తిట్టారని టీడీపీ నాయకులు అన్నారు. ఈ మేరకు శనివారం స్థానిక పోలీస్‌ స్టేషనలో ఎస్‌ఐ సోమశేఖర్‌కు ఫిర్యాదు చేశారు. ఆ నాయకులు మాట్లాడుతూ.. 2022 నవంబరులో రాప్తాడు ఎంపీడీఓ కార్యాలయంలో చంద్రబాబు, నారా లోకేష్‌ను చంద్రు తీవ్ర పదజాలంతో దూషించాలని, ఆ వీడియోలు నేటికీ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయని అన్నారు. తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు జిల్లా నాయకులు గంటాపురం జగ్గు, నారాయణరెడ్డి, సంగాలసూరి, సురేంద్ర పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2025 | 11:47 PM