AP universities: ఒకేసారి పరీక్షలు ఫలితాలు
ABN , Publish Date - May 21 , 2025 | 02:57 AM
2025–26 విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు ఏకైక అకడమిక్ క్యాలెండర్ అమల్లోకి రానుంది. డిగ్రీ, ఇంజనీరింగ్, బీఫార్మసీ కోర్సులకు ఒకే షెడ్యూలు ప్రకారం అడ్మిషన్లు, పరీక్షలు, ఫలితాలు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది.
ఉన్నత విద్య అకడమిక్ క్యాలెండర్ విడుదల
ఆగస్టు 4 నుంచి ఇంజనీరింగ్, 11 నుంచి డిగ్రీ తరగతులు
అమరావతి, మే 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అకడమిక్ కార్యకలాపాలను ఏకతాటిపైకి తేవాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. అన్ని యూనివర్సిటీలు... అడ్మిషన్లు, తరగతులు, పరీక్షలు, ఫలితాలు ఒకే సమయంలో నిర్వహించాలని స్పష్టం చేస్తూ 2025-26 మోడల్ అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసింది. డిగ్రీ, ఇంజనీరింగ్, బీఫార్మసీ కోర్సులకు కామన్ షెడ్యూలు తేదీలను అందులో సూచించింది. ఇన్నాళ్లూ యూనివర్సిటీలు వేర్వేరుగా అడ్మిషన్లు, పరీక్షలు నిర్వహిస్తుండటంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఇకపై అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు మొదటి వారం నాటికి డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తిచేస్తారు. జూలై చివరి వారం నాటికి ఇంజనీరింగ్ అడ్మిషన్లు, ఫార్మసీ అడ్మిషన్ల ప్రక్రియ ముగిస్తారు. ప్రతి శనివారం పలు అంశాలపై కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఉన్నత విద్యామండలి సూచించింది. యాంటీ ర్యాగింగ్, డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలు, సోషల్ మీడియా ప్రభావం తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాలు ఉంటాయి. సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 5 వరకు దసరా, జనవరి 10 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
Tiruvuru Political Clash: తిరువూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్
Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే
Read Latest AP News And Telugu News