కలిసి రండి...పార్టీ కోసం కష్టపడి పనిచేద్దాం
ABN , Publish Date - Feb 09 , 2025 | 11:42 PM
కలిసి రండి... తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి దాసరిపల్లి జయచంద్రారెడ్డి అధ్వర్యంలో పార్టీ కోసం కష్టపడి పనిచే ద్దామని టీడీపీ జిల్లా కార్య దర్శి యర్రగుడి సురేష్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ ఛైర్మన కేవీ రమణ పేర్కొన్నా రు.

ములకలచెరువు, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): కలిసి రండి... తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి దాసరిపల్లి జయచంద్రారెడ్డి అధ్వర్యంలో పార్టీ కోసం కష్టపడి పనిచే ద్దామని టీడీపీ జిల్లా కార్య దర్శి యర్రగుడి సురేష్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ ఛైర్మన కేవీ రమణ పేర్కొన్నా రు. ములకలచెరువులోని పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమా వేశంలో వారు మాట్లాడుతూ తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పార్టీలో ప్రస్తుతం జరు గుతున్న పరిణామాలను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌యాదవ్ దృష్టికి తీసు కెళ్ళామన్నారు. కావాలనే కొందరు వైసీపీ కోవలర్టులు టీడీపీ కుటుంబసభ్యుల మధ్య చిచ్చులు పెట్టి పార్టీని భ్రష్టుపట్టించాలని చూస్తున్నారని రాష్ట్ర అధ్యక్షుడు దృష్టికి తీసుకె ళ్ళామన్నారు. ఒక సారి అందరితో మాట్లాడి తంబళ్లపల్లె ఇనచార్జి జయచంద్రారెడ్డి అధ్వర్యంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌యాదవ్ సూచించారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు, పార్టీ కోసం కష్టపడి పనిచేయడానికి ఎవరూ ముందుకొచ్చినా కలుపుకుపోతామన్నారు. ఈ సమా వేశంలో నాయకులు ఎల్‌ఐసీ భాస్కర్‌రెడ్డి, పాల రాము, చాంద్‌బాషా, కట్టా హరినాధ్, సుబ్బినాయుడు, శ్రీనివాసులు, గణేష్, చెన్నకేశవులు, రెడ్డెప్ప, చాంద్‌బాషా, నీలకంఠారెడ్డి, శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.