Share News

గురు వైభవోత్సవాలకు రండి

ABN , Publish Date - Feb 26 , 2025 | 11:42 PM

మంత్రాలయం రాఘవేంద్రస్వామి గురు వైభవోత్సవాలకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేశకు శ్రీమఠం అధికారులు ఏఏవో మాధవశెట్టి, మఠం మేనేజర్‌, ఈఈ సురేష్‌ కోనాపూర్‌, ఏఈ బద్రినాథ్‌, సూపరింటెండెంట్‌ అనంతపురాణిక్‌ ఆహ్వానపత్రికను అందజేశారు.

   గురు వైభవోత్సవాలకు రండి

మంత్రి నారా లోకేశకు శ్రీమఠం ఆహ్వానం

ఫ మార్చి 1న పర్యటన ఖరారు

మంత్రాలయం, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్రస్వామి గురు వైభవోత్సవాలకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేశకు శ్రీమఠం అధికారులు ఏఏవో మాధవశెట్టి, మఠం మేనేజర్‌, ఈఈ సురేష్‌ కోనాపూర్‌, ఏఈ బద్రినాథ్‌, సూపరింటెండెంట్‌ అనంతపురాణిక్‌ ఆహ్వానపత్రికను అందజేశారు. బుధవారం మంత్రి లోకేశ నివాసంలో కలిసి గురుభక్తి ఉత్సవాలకు రావాలిన ఆహ్వానించారు. దీంతో మార్చి 1న ఉత్సవాలు ప్రారంభమయ్యే రోజు రాఘవేంద్రస్వామి 404 పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొనేందుకు అమరావతి నుంచి హెలికాప్టర్‌ ద్వారా ఉదయం 10 గంటలకు మంత్రాలయం చేరుకుని రాఘవేంద్రస్వామిని దర్శించుకుని గురు వైభవోత్సవ-2025 అవార్డును పీఠాధిపతి చేతుల మీదుగా అందుకుంటారని మఠం అధికారులు తెలిపారు. అనంతరం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులతో ఫోన ద్వారా మాట్లాడించారు. మంత్రి లోకేశ పర్యటన ఖరారు కావడంతో హెలిప్యాడ్‌ మైదానం, వసతి, దర్శనం, భద్రతా ఏర్పాట్లు, అవార్డు ప్రదానానికి ఏర్పాట్లులో పోలీసు రెవెన్యూ శ్రీమఠం అధికారులు నిమగ్నమయ్యారు. దీంతో టీడీపీ జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గ ఇనచార్జి రాఘవేంద్ర రెడ్డి, మండల కన్వీనర్‌ పన్నగ వెంకటేశ స్వామి వేర్వేరుగా తమ నాయకులతో సమావేశమై లోకేశ పర్యటనను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని కోరారు.

Updated Date - Feb 26 , 2025 | 11:42 PM