MSME Support: కలెక్టర్లకు ట్రెడ్స్ సదస్సుల బాధ్యత
ABN , Publish Date - Sep 04 , 2025 | 03:29 AM
రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామిక సంస్థల బిల్లుల పరిష్కారం కోసం భాగస్వామ్య పక్షాల సమన్వయంతో అన్ని జిల్లాల్లో ట్రెడ్స్..
అమరావతి, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామిక సంస్థల బిల్లుల పరిష్కారం కోసం భాగస్వామ్య పక్షాల సమన్వయంతో అన్ని జిల్లాల్లో ట్రెడ్స్ (ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్) అవగాహన వర్క్‌షాపులను నిర్వహించే బాధ్యతను ప్రభుత్వం ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించింది. ఈ నెల వరకు నిర్వహించాల్సిన వర్కుషాపులకు మంజూరు చేసిన నిధులలో 80 శాతం ముందుగానే కలెక్టర్లకు విడుదల చేయడానికి అనుమతించింది. రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ (ఎంఎ్‌సఎంఈడీసీ) సీఈవో చేసిన ఈ ప్రతిపాదనలను ఆమోదిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్లు, రాష్ట్రస్థాయి స్వయం ప్రతిపత్తి సంస్థలు, సంఘాలకు వస్తు, సేవలందించే సరఫరాదారులైన ఎంఎ్‌సఎంఈలకు బిల్లుల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వ ‘ర్యాంప్’ (రైజింగ్ అండ్ యాక్సెలరేటింగ్ ఎంఎ్‌సఎంఈ పెర్ఫార్మెన్స్) పథకంలో భాగంగా ఈ ట్రెడ్స్ ఫ్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేశారు.