BJP State President Madhav: లిక్కర్ స్కామ్ వెలికితీతలో కూటమి కృషి అద్భుతం
ABN , Publish Date - Jul 26 , 2025 | 04:24 AM
ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్‌ను వెలికి తీయడంలో కూటమి ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోంది. ఈ కుం భకోణంలోని ప్రతి ఒక్కరినీ జైలుకు...
ప్రధాని విజయాలపై ‘సారథ్యం’ పేరుతో ప్రజల్లోకి: మాధవ్
అమరావతి, జూలై 25(ఆంధ్రజ్యోతి): ‘ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్‌ను వెలికి తీయడంలో కూటమి ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోంది. ఈ కుం భకోణంలోని ప్రతి ఒక్కరినీ జైలుకు పంపి తీరాలి’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. విజయవాడలోని ఆ పార్టీ కార్యాలయంలో ‘సారథ్యం’ పోస్టర్‌ను విడుదలచేసి మాట్లాడారు. ‘నాలుగు వేల రోజులకు పైగా దేశానికి సారథ్యం వహించిన నరేంద్ర మోదీ భారత్‌ను గ్లోబల్ ఫోర్స్‌గా తీర్చిదిద్దారు. ఆయన హయాంలో దేశం సాధించిన విజయాలను కడప నుంచి ఈ నెల 27న ‘సారఽథ్యం’ పేరుతో ప్రజల్లోకి తీసుకెళ్లనున్నాం.’ అని మాధవ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
కస్టమర్ల ఖాతాల నుంచి కోట్ల రూపాయల దోపిడీ.. పరారీలో ఎస్‌బీఐ క్లర్క్
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..
For More Andhrapradesh News And Telugu News