Share News

CM Chandrababu: తోతాపురి సేకరణకు 130 కోట్లు ఇవ్వండి

ABN , Publish Date - Jul 07 , 2025 | 02:12 AM

మార్కెట్‌ జోక్యం పథకం ద్వారా తోతాపురి మామిడి రైతులను ఆదుకునేందుకు రూ.130 కోట్లు విడుదల చేయాలని కోరుతూ సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు.

CM Chandrababu: తోతాపురి సేకరణకు 130 కోట్లు ఇవ్వండి

కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ

అమరావతి, జూలై 6(ఆంధ్రజ్యోతి): మార్కెట్‌ జోక్యం పథకం ద్వారా తోతాపురి మామిడి రైతులను ఆదుకునేందుకు రూ.130 కోట్లు విడుదల చేయాలని కోరుతూ సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల కలెక్టరేట్లలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లు ఏర్పాటు చేసి, మామిడి కొనుగోళ్లపై సీఎం రోజు వారీ సమీక్ష చేస్తున్నారు. పార్లే ఆగ్రో, కోకోకోలా, పెప్సీ తదితర సంస్థలు రైతుల నుంచి తోతాపురి కొనుగోలు చేసేలా ఆదేశాలు జారీ చేశారు. ప్రొసెసింగ్‌ యూనిట్లు, ట్రేడర్లు కిలోకు రూ.8 చెల్లించి కొనుగోలు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం భరించే రూ.4తో రైతులకు రూ.12 ధర దక్కేలా చర్యలు చేపట్టారు. ఆదివారం రాత్రి సీఎంవో అధికారులు మామిడి కొనుగోళ్లపై సమీక్ష చేశారు. ఇప్పటి వరకు 3.08 లక్షల టన్నుల పంట కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. చిత్తూరు జిల్లాలో 1.65 లక్షల టన్నులు, తిరుపతి జిల్లాలో 45 వేల టన్నులు, అన్నమయ్య జిల్లాలో 16,400 టన్నులు కొనుగోలు చేయగా, ర్యాంపులు, మండీల ద్వారా మరో 81 వేల టన్నులు ఇతర రాష్ట్రాలకు విక్రయించినట్లు అధికారులు వివరించారు.

Updated Date - Jul 07 , 2025 | 02:14 AM