Share News

CM Chandrababu : రేపు నెల్లూరు జిల్లాకు చంద్రబాబు

ABN , Publish Date - Feb 14 , 2025 | 06:37 AM

నెల్లూరు జిల్లా కందుకూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 15న పర్యటిస్తారు. శనివారం మధ్యాహ్నం 12.05 గంటలకు పట్టణంలోని దూబగుంట

CM Chandrababu : రేపు నెల్లూరు జిల్లాకు చంద్రబాబు

కందుకూరులో ‘స్వచ్ఛాంధ్ర’లో పాల్గొననున్న సీఎం

కందుకూరు, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లా కందుకూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 15న పర్యటిస్తారు. శనివారం మధ్యాహ్నం 12.05 గంటలకు పట్టణంలోని దూబగుంట సమీపంలో ఏర్పాటు చేస్తున్న ఎంఆర్‌ఎఫ్‌ ఫెసిలిటీ సెంటర్‌ (వేస్ట్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌)కు చేరుకుని అక్కడ మిషినరీని ప్రారంభిస్తారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామంలో వీధులు, డ్రైనేజీలు శుభ్రం చేసే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఎంపిక చేసిన మూడు గృహాలలో ఇంకుడుగుంతలను ప్రారంభిస్తారు. అనంతరం పార్కు కమ్‌ పాండ్‌ను సందర్శిస్తారు. బహిరంగ సభలో మాట్లాడటంతోపాటు మున్సిపాలిటీలోని ప్రజలతో ముఖాముఖి మాట్లాడతారు. అనంతరం హెలిపాడ్‌కు చేరుకుని ఉండవల్లి బయలుదేరి వెళతారు.

Updated Date - Feb 14 , 2025 | 06:37 AM