Share News

CM Chandrababu: బనకచర్ల మొదలెడదాం

ABN , Publish Date - Jun 06 , 2025 | 04:32 AM

పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకంపై కేంద్రం సానుకూలంగా ఉన్నందున.. పనులు మొదలుపెట్టే దిశగా చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు.

CM Chandrababu: బనకచర్ల మొదలెడదాం

  • ప్రాధాన్య ప్రాజెక్టులపై నేడు సీఎం సమీక్ష

అమరావతి, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకంపై కేంద్రం సానుకూలంగా ఉన్నందున.. పనులు మొదలుపెట్టే దిశగా చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. కేంద్రానికి సమర్పించనున్న సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)కు కొన్ని సూచనలు చేయనున్నారు. ఈ నెలలోనే టెండర్లను పిలిచేందుకు జలవనరుల శాఖను సమాయత్తం చేస్తారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో పోలవరం, బనకచర్ల, ఇతర ప్రాధాన్య ప్రాజెక్టులపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. శ్రీశైలం జలాశయం మరమ్మతు పనులపైనా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు.

Updated Date - Jun 06 , 2025 | 04:34 AM