Share News

Political Memories: అంబాసిడర్‌ కారు.. మనసు పెట్టేశారు సారు

ABN , Publish Date - Nov 01 , 2025 | 04:31 AM

మూడు దశాబ్దాల క్రితం తాను ఉపయోగించిన అంబాసిడర్‌ కారుతో ఉన్న అనుబంధాన్ని సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

Political Memories: అంబాసిడర్‌ కారు.. మనసు పెట్టేశారు సారు

  • ఆ కారుతో 3 దశాబ్దాల అనుబంధం.. గుర్తుచేసుకున్న సీఎం

అమరావతి, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): మూడు దశాబ్దాల క్రితం తాను ఉపయోగించిన అంబాసిడర్‌ కారుతో ఉన్న అనుబంధాన్ని సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. 393 నంబరుతో ఉండే ఈ కారు ఆయన సొంత వాహనం. దీనిలోనే ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఆయన విస్తృతంగా పర్యటించేవారు. 393 అంబాసిడర్‌ అంటేనే చంద్రబాబు బ్రాండ్‌ కార్‌ అనేలా గుర్తింపు పొందింది. ప్రస్తుతం నాలుగోసారి సీఎంగా ఉన్న చంద్రబాబు భద్రత పరంగా ఆధునిక వాహనాలు వినియోగిస్తున్నా, తన సొంత కారును మాత్రం అపురూపంగానే చూసుకుంటున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో ఉన్న ఈ కారును ఇకనుంచి అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉంచనున్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయానికి వచ్చి, తిరిగి వెళ్తున్న సమయంలో ఆనాడు తాను వాడిన అంబాసిడర్‌ను చంద్రబాబు పరిశీలించారు. ఆ కారులో తన ప్రయాణ స్మృతులను గుర్తు చేసుకున్నారు.

ఇవీ చదవండి:

వేల కోట్ల విలువైన ఐపీవోల విడుదల.. ఎప్పుడంటే..?

ప్రభుత్వ బ్యాంకుల్లోకి 49శాతం విదేశీ పెట్టుబడులు

Updated Date - Nov 01 , 2025 | 07:57 AM