Share News

Chandrababu Naidu: సంకల్పంతో సవాళ్లు దాటొచ్చు

ABN , Publish Date - Apr 25 , 2025 | 04:53 AM

మంత్రివర్యుడు నారాయణ కుమార్తె శరణి రచించిన 'మైండ్‌సెట్‌ షిఫ్ట్‌' పుస్తకాన్ని సీఎం చంద్రబాబు విజయవాడలో ఆవిష్కరించారు. చిరంజీవి, చంద్రబాబు కలిసి పుస్తకావిష్కరణలో పాల్గొని సరదాగా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

Chandrababu Naidu: సంకల్పంతో సవాళ్లు దాటొచ్చు

నారాయణ కుమార్తెల ఎదుగుదల చూసి ఆశ్చర్యపోయా

శరణి రాసిన ‘మైండ్‌సెట్‌ షిఫ్ట్‌’ ఆవిష్కరణలో చంద్రబాబు

మన మైండ్‌ మంచేదో చెబుతుంది: చిరంజీవి

అమరావతి, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): నమ్మకానికి సంకల్పం తోడైతే ఎలాంటి సవాళ్లనైనా అధిగమించవచ్చని, మనిషి దృఢసంకల్పం ఎంతలా పనిచేస్తుందనడానికి ఎన్టీఆర్‌ జీవితమే ఒక ఉదాహరణ అని సీఎం చంద్రబాబు అన్నారు. మంత్రి నారాయణ కుమార్తె శరణి రచించిన ‘మైండ్‌సెట్‌ షిఫ్ట్‌’ పుస్తకాన్ని గురువారం విజయవాడలోని ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌లో ఆవిష్కరించారు. తొలి కాపీని మెగాస్టార్‌ చిరంజీవికి అందజేశారు. అనంతరం శరణి అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు, చిరంజీవి సరదాగా సమాధానం చెప్పారు. నారాయణ కుమార్తెల ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోయానని, వాళ్లను ఇప్పటిదాకా చిన్న పిల్లలుగానే చూశానని సీఎం అన్నారు. నారాయణ అంటే తనకు ప్రత్యేకమైన అభిమానమన్నారు. చిరంజీవి ఒక సంకల్పం తీసుకుని అద్భుత నటుడయ్యారని, తన జీవితంలో పాజిటివ్‌ మైండ్‌సెట్‌ అభివృద్ధి చేసుకుని లక్ష్యాన్ని చేధించేవరకు నిరంతర కృషి చేశారని ప్రశంసించారు. తాను సీఎంగా ఉన్న సమయంలో చిరంజీవి కలిశారని, ఉమ్మడి రాష్ట్రంలో ప్రజల కోసం బ్లడ్‌ బ్యాంక్‌ పెడతానంటే స్థలం కేటాయించానని గుర్తు చేశారు. శరణి అడిగిన ప్రశ్నకు చిరంజీవి సమాధానం చెబుతూ.. మన మైండ్‌ మనకు ఏది మంచిదో చెబుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మైండ్‌సెట్‌ ఎప్పుడూ నాయకత్వ లక్షణాలతో ఉంటుందన్నారు. మహా నాయకుడిగా ఎదిగి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారన్నారు. ఇలాంటి నాయకుల మైండ్‌సెట్‌ మనకు ఆదర్శం కావాలన్నారు. కార్యక్రమంలో పహల్గాం ఉగ్రదాడి మృతులకు సంతాప సూచకంగా నిమిషం మౌనం పాటించారు.


Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 25 , 2025 | 04:53 AM