Share News

CM Chandrababu Naidu: పాలనలో మానవీయకోణం

ABN , Publish Date - Apr 25 , 2025 | 03:43 AM

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ద్వారా వేగవంతమైన సేవలు అందించాలన్నా, పాలనలో మానవీయత ముఖ్యం అని సీఎం చంద్రబాబు తెలిపారు. భూ రికార్డుల డిజిటలైజేషన్‌ వేగవంతం చేసి, ప్రజల ఫిర్యాదులకు త్వరిత పరిష్కారాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

CM Chandrababu Naidu: పాలనలో మానవీయకోణం

వేగవంతమైన సేవలకు ఏఐ వినియోగం

స్మార్ట్‌ పాలనకు ‘4. ఓ’లో అధిక ప్రాధాన్యం

పాత పాలన పంథాను మార్చుకోవాలి

గతంలోని పద్ధతులకు

నూతన సాంకేతికత జోడించాలి

ఆ దిశగా ప్రజాసేవకు సిద్ధం కావాలి

రాష్ట్రంలో త్వరలోనే భారీ డేటా లేక్‌

శాఖాధిపతులకు ఏఐ వర్క్‌షాప్‌

ప్రారంభంలో సీఎం చంద్రబాబు

అమరావతి, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడానికి కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌-ఏఐ)ను వినియోగించినా, పాలనలో మానవీయ కోణం అత్యంత ముఖ్యమని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. టెక్నాలజీ వినియోగంతో రియల్‌ టైమ్‌ పాలనను ప్రజలకు అందించాలని చెప్పారు. స్మార్ట్‌ పాలనకు ‘4.ఓ’లో అత్యంత ప్రాఽధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో గురువారం ప్రభుత్వశాఖాధిపతుల కోసం ఏర్పాటు చేసిన రెండు రోజుల ఏఐ వర్క్‌షాపును సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ‘‘ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫర్‌ గవర్నెన్స్‌ డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌’’ అంశంపై జరిగిన వర్క్‌షా్‌పలో అధికారులకు పలు సూచనలు చేస్తూ సీఎం ప్రసంగించారు. పాలనలో ఏఐకు అధిక ప్రాధాన్యం ఇస్తూనే మానవీయ కోణంలో ప్రజలకు సేవలందిస్తామని, సంక్షేమాన్ని అమలు చేస్తామని సీఎం చెప్పారు. ఏఐ ఆధారిత స్మార్ట్‌ పాలనా వ్యవస్థ వల్ల రియల్‌ టైమ్‌లో వేగవంతమైన సేవలు అందుతాయని తెలిపారు.

fdh.jpg

పాత పరిపాలనా విధానాలకు నూతన సాంకేతిక నైపుణ్యాలను జోడిస్తామన్నారు. అధికారులు ఈ దిశలో ప్రజా సేవలకు సిద్ధం కావాలని సీఎం పిలుపు ఇచ్చారు. రాష్ట్రంలో త్వరలోనే భారీ డేటా లేక్‌ను ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టాలని ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖను ఆదేశించారు.


ఇంటర్నెట్‌ కోసం ఎదురు చూసే రోజులవి

టెక్నాలజీలో వచ్చిన మార్పులను ఈ సందర్భంగా సీఎం ప్రస్తావించారు. ఒకప్పుడు ఇంటర్నెట్‌ కనెక్షన్‌ కోసం ఎదురు చూసేవారమని, 2 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో ఇంటర్నెట్‌ సేవలు దొరకడమే గగనమయ్యేదని గత రోజులను గర్తుచేశారు. ఆ దశ నుంచి వేగవంతమైన ఇంటర్నెట్‌ సేవలతో కూడిన పాలన అందించే స్థాయికి ఎదిగామని చెప్పారు. ఇప్పుడు డేటా ఆధారిత పాలన అందిస్తున్నామని పేర్కొన్నారు. ముప్పయి ఏళ్ల క్రితం చేసిన ప్రయత్నంతో నేడు టెక్నాలజీలో ఏపీ కీలకంగా ముందుందని అన్నారు. ఒకప్పుడు ఇస్రో ఉపగ్రహ ప్రయోగాలను ఆశ్చర్యంగా చూశామని, ఇప్పుడు మన స్టార్ట్‌పలు రూ. 30 కోట్లతో ఉపగ్రహాలను తయారు చేస్తున్నాయని చంద్రబాబు చెప్పారు. దీంతో .. ప్రపంచం మనవైపు గర్వంగా చూస్తోందని చెప్పారు.


వేగంగా భూ రికార్డుల డిజిటలైజేషన్‌

భూ రికార్డుల డిజిటలైజేషన్‌ కార్యక్రమం వేగవంతంగా చేపట్టాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, వినతుల్లో అత్యధికంగా.. 75 శాతం భూములకు చెందినవే ఉన్నాయని వివరించారు. ఈ సమస్య పరిష్కారానికి త్వరితగతిన భూ రికార్డుల డిజిటలైజేషన్‌ చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ వ్యవస్థల్లో మేధోసంపత్తి ఉన్నవారు ఉన్నా ఇంకా పాత విధానంలోనే పాలన జరుగుతోందని, ఈ పంథాను అధికారులు మార్చుకోవాల్సి ఉందని సీఎం అన్నారు. ఈ రెండు రోజుల పాలనాధికారుల ఏఐ వర్క్‌షాప్‌ దేశానికి ఒక ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. ఇలాంటి వర్క్‌షాప్‌ పాలనకు అత్యంత ముఖ్యమని అభిప్రాయపడ్డారు.


Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 25 , 2025 | 03:43 AM