Ministerial performance : మంత్రులు.. ర్యాంకులు
ABN , Publish Date - Feb 07 , 2025 | 04:17 AM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి 2024 డిసెంబరు వరకు ఫైళ్లను పరిష్కరించడం లో మంత్రుల పనితీరు ఎలా ఉందనే అంశాన్ని కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. మం త్రుల్లో ఎవరెవరు, ఏ స్థానంలో ఉన్నా రో చదివి వినిపించారు.

ఫైళ్ల పరిష్కారంలో ఫరూక్ టాప్.. సీఎంకు ఆరో స్థానం
8వ స్థానంలో లోకేశ్.. పదిలో పవన్
చివరి స్థానానికి పరిమితమైన వాసంశెట్టి
కేబినెట్ భేటీలో వెల్లడించిన చంద్రబాబు
ఫైళ్లను వేగంగా పరిష్కరించాలని సూచన
అమరావతి, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి 2024 డిసెంబరు వరకు ఫైళ్లను పరిష్కరించడం లో మంత్రుల పనితీరు ఎలా ఉందనే అంశాన్ని కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. మం త్రుల్లో ఎవరెవరు, ఏ స్థానంలో ఉన్నా రో చదివి వినిపించారు. తాను 6వ స్థానంలో ఉన్నట్లు సీఎం పేర్కొన్నారు. ఆరు నెలల్లో సగటున 2.30 గంటలకు ఒక ఫైల్ చొప్పున క్లియర్ చేసిన మై నార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ మొదటి స్థానంలో ఉన్న ట్లు తెలిపారు. తమ వద్దకు వచ్చి న ఫైళ్ల ను వేగంగా పరిష్కరించాలని మంత్రులకు సూచించారు. జనవరి నుంచి లెక్కలు తీస్తే తమ పనితీరు చాలా మెరుగుపడిందని పలువురు మం త్రులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.
పోలవరం నిర్వాసితులకు జీవనోపాధి
పోలవరం నిర్వాసితుల్లో చాలామంది పరిస్థితి దయనీయంగా ఉందని, భూములను కోల్పోయినవారు సరైన జీవనోపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని సీఎం వ్యాఖ్యానించారు. నిర్వాసితుల జీవనోపాధికి మార్గం చూపాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. వైసీపీ హయాంలో నిలిచిపోయిన ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ పనులకు మళ్లీ టెండర్లు పిలవాలని నిర్ణయించారు.
అధికారులకు శిక్షణ కేంద్రం
ప్రభుత్వ అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లో మంచి శిక్షణ కేంద్రం ఉండేదని, ప్రస్తుతం ఏపీలో అలాంటి శిక్షణ కేంద్రం నెలకొల్పాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. బాపట్లలో శిక్షణ కేంద్రం ఉన్నా అది పెద్దగా ప్రయోజనకరంగా లేదని, అమరావతిలో అత్యాధునిక వసతులతో మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (హెచ్‌ఆర్డీ)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అనంతపురంలో కస్టమ్స్ అధికారుల కోసం అన్ని సౌకర్యాలతో శిక్షణ కేంద్రం ఉందని, దాన్ని పరిశీలించి అంతకన్నా మెరుగైన శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంపై దృష్టి సారించాలని సీఎం సూచించారు. దీనికోసం మంత్రులు లోకేశ్, పయ్యావుల కేశవ్, నారాయణతో ఓ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అనంతపురం వెళ్లి కస్టమ్స్ శిక్షణ కేంద్రాన్ని పరిశీలించి రావాలని సీఎం సూచించారు.