CM Chandrababu: ఆగమశాస్త్ర పండితులకు నెలనెలా సంభావన
ABN , Publish Date - Apr 21 , 2025 | 05:06 AM
ఆగమ శాస్త్ర పండితులకు నెలకి రూ. 3,000 చొప్పున సంభావన అందించేందుకు సీఎం చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో వేద పండితులకు సంభావన చెక్కులు అందజేశారు.
ఆత్మకూరు, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): వేద పారాయణం చేసి ఖాళీగా ఉన్న వేద పండితులకు నెలకు రూ. 3వేల చొప్పున సంభావన అందించేందుకు సీఎం చంద్రబాబు ఉత్తర్వులు ఇచ్చినట్లు దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆదివారం నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగిన చంద్రబాబు పుట్టిన రోజు వేడుకల్లో ఆయన పాల్గొని మహాహోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దేవదాయ శాఖ జోనల్ అధికారి, శ్రీకాళహస్తి ఈవో బాపిరెడ్డితో కలిసి వేద పండితులకు సంభావన చెక్కులు అందజేశారు. రాష్ట్రంలో ఆగమ శాస్త్రం చదివి సర్టిఫికెట్ పొందిన 599 మందికి నెలకు రూ. 3,000 చొప్పున జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు రూ. 53,91,000 సంభావనను వారి ఖాతాల్లో జమ చేశామన్నారు